Home » “పుష్ప‌”ను రిజెక్ట్ చేసి మ‌హేష్ మంచిప‌ని చేశాడా..?

“పుష్ప‌”ను రిజెక్ట్ చేసి మ‌హేష్ మంచిప‌ని చేశాడా..?

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ఫ సినిమా ఈరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్లలో విడుద‌లైంది. సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ కు వ‌చ్చిన హైప్ తో థియేట‌ర్ల వద్ద సందడి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

బెనిఫిట్ షో ల‌కోసం అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు క్యూ క‌ట్టారు. ఇక ఈ రోజు విడుద‌లైన పుష్ప సినిమాపై ఇప్ప‌టికే అభిమానులు ప్రేక్ష‌కులు త‌మ రివ్యూను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌టం స‌మంత ఐట‌మ్ సాంగ్ అల్లు అర్జున్ న‌ట‌న‌ సినిమాకు ప్లస్ కాగా క్లైమాక్స్ చాలా వీక్ గా ఉంద‌ని రివ్యూస్ వ‌స్తున్నాయి. మ‌రోవైపు కొందరు ప్రేక్ష‌కులు సినిమా అస‌లు భాగోలేద‌ని ఫ‌స్ట్ ఆఫ్ చాలా డ‌ల్ గా ఉంద‌ని ఇక సెకండ హాఫ్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిద‌ని రివ్యూలు ఇస్తున్నారు.ఇదిలా ఉండ‌గా మొద‌ట పుష్ప సినిమా ఆఫ‌ర్ మ‌హేష్ బాబుకే వ‌చ్చింద‌ట‌. కానీ క్రియేటివ్ డిష‌రెన్స్ ల వ‌ల్ల మహేష్ బాబు ఆ సినిమాను ప‌క్క‌న పెట్టేశార‌ట‌.

Advertisement

also read : PUSHPA TWITTER REVIEW : “పుష్ప” మూవీ రివ్యూ

కానీ సుకుమార్ పుష్ప సినిమాను అనౌన్స్ చేసిన స‌మ‌యంలో మహేష్ బాబు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పాడు. సుకుమార్ తో నేనొక్క‌డినే చేసాన‌ని ఆ సినిమా క‌ల్ట్ క్లాసిక్ గా నిలిచింద‌ని పేర్కొన్నాడు. సుకుమార్ తో పనిచేసిన ప్ర‌తిక్ష‌ణం ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు.అయితే ఇప్పుడు మ‌హేశ్ బాబు ట్విట్ వైర‌ల్ అవుతోంది. అంతే కాకుండా పుష్ప కు నో చెప్పి మంచిప‌ని చేశావ్ అన్నా అంటూ మ‌హేష్ అభిమానులు అంటున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కౌంట‌ర్లు ఇస్తున్నారు.

Visitors Are Also Reading