Home » మ‌హేశ్ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో నాగ‌చైత‌న్య స్టార్ అయ్యాడు…? ఆ సినిమా ఏదో తెలుసా..?

మ‌హేశ్ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో నాగ‌చైత‌న్య స్టార్ అయ్యాడు…? ఆ సినిమా ఏదో తెలుసా..?

by AJAY
Ad

ప్ర‌పంచంలో ఇంత‌మంది అమ్మాయిలు ఉండ‌గా నేను జెస్సినే ఎందుకు ప్రేమించాను..? అప్ప‌ట్లో ఈ డైలాగ్ ను యూత్ తెగ వాడేశారు. అమ్మాయిల‌కు ఇదే డైలాగ్ చెప్పి వారిని పొగిడేవారు. ఏమ్మాయ చేశావే సినిమాలో నాగ‌చైత‌న్య త‌ర‌చూ స‌మంత‌తో ఈ డైలాగ్ చెబుతుంటాడు. ఈ సినిమాకు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గౌత‌మ్ మీన‌న్ అంటే స్లో గా వెళ్లే ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిష్ట్ అనే చెప్పాలి.

Advertisement

ఈ సినిమాను గౌత‌మ్ మీన‌న్ త‌మిళ్ లో శింబు తో తెర‌కెక్కించాడు. అక్క‌డ జెస్సీ పాత్ర‌లో త్రిష హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక తెలుగులో డ‌బ్ చేయ‌కుండా రీమేడ్ చేయాల‌ని గౌత‌మ్ మీన‌న్ నిర్ణయించుకున్నాడు. అయితే మొద‌ట‌గా ఈ సినిమా క‌థ‌ను నాగ‌చైత‌న్య కు మాత్రం వినిపించ‌లేదు. మొద‌ట‌గా ఈ సినిమా క‌థ‌ను టాలీవుడ్ లోని నంబ‌ర్ వ‌న్ హీరోల‌లో ఒక‌రైన మ‌హేశ్ బాబుకు వినిపించాడు.

Advertisement

ఈ సినిమా చూసిన మ‌హేశ్ బాబు క‌చ్చితంగా ఈ సినిమాను చేయాల‌ని అత‌డికి సూచించింది. దాంతో మ‌హేశ్ బాబు కూడా గౌత‌మ్ మీన‌న్ చెప్పిన క‌థ‌ను ఓపిగ్గా విన్నాడు. క‌థ మ‌హేశ్ బాబ‌కు న‌చ్చేసింది. అయిన‌ప్ప‌టికీ త‌న స్టార్ ఇమేజ్ కు ఈ సినిమా క‌థ సెట్ కాద‌ని బావించాడ‌ట‌. దాంతో మ‌హేశ్ బాబు ఈ సినిమా వ‌ద్దు కావాలంటే మ‌నం ఒక మాస్ సినిమా చేద్దామ‌ని గౌత‌మ్ మీన‌న్ ను నొప్పించ‌కుండా చెప్పి పంపించేశాడు.

అలా మ‌హేశ్ బాబు రిజెక్ట్ చేయ‌డంతో గౌత‌మ్ మీన‌న్ ఇదే క‌థ‌ను చైతూకు చెప్పి ఒప్పించాడు. ఇక ఈ సినిమాతోనే స‌మంత హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ స‌మంత కూడా మొద‌ట రిజెక్ట్ చేసింద‌ట‌. కానీ గౌత‌మ్ మీన‌న్ ప‌ట్టుబ‌ట్టి స‌మంత‌ను ఒప్పించాడ‌ట‌. అలా ఫైన‌ల్ గా స‌మంత చైతూలతో ఏమ్మాయ చేసావే సినిమా చేసి గౌత‌మ్ మీన‌న్ బ్లాక్ బస్ట‌ర్ అందుకున్నారు.

Visitors Are Also Reading