Home » మహేష్ తో జక్కన సినిమా వాయిదా…?

మహేష్ తో జక్కన సినిమా వాయిదా…?

by Azhar
Ad

బాహుబలి సినిమాతో మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న హీరోల అందరి చూపు అనేది మన టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పైనే పడింది. కాబట్టి ఆయన ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఏ స్టార్ హీరో అయినా ఇస్తాడు. కానీ రాజమౌళి మాత్రం మన తెలుగు హీరోలతోనే సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ తో బాహుబలి అయిన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా తీసాడు. ఇది ఈ ఏడాదే విడుదల అయ్యింది.

Advertisement

ఇక ఈ సినిమా తీస్తున్న సమయంలోనే జక్కన తన తర్వాతి సినిమా అనేది సూపర్ స్టార్ మహేష్ బాబుతో థియనునట్లు ప్రకటించాడు. ప్రమోషన్స్ లో కూడా అదే విషయం చెప్పాడు. ఇక మహేష్ బాబు కూడా ఈ విషయంలో క్లారిటీ అనేది ఇచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ కాంబోలో రాబోయే సినిమా అనేది వాయిదా పడినట్లు తెలుస్తుంది. అయితే మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.

Advertisement

ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల త్రివిక్రమ్ సినిమా అనేది మహేష్ మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడు ఇక్కడ షూటింగ్స్ అనేవి ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. అందువల్ల విడుదల కూడా లెట్ అవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాతే మహేష్ జక్కన సినిమా ప్రారంభించగలడు. కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే ఈ సినిమా షూటింగ్ స్టార్ అవుతుంది అని… 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా 2026 లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఒక్కే జెర్సీని వేసుకున్న భారత ఆటగాళ్లు..!

మళ్ళీ పాకిస్థాన్ వెళ్తాను అంటున్న ఇంగ్లాండ్..!

Visitors Are Also Reading