గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కడు. 2003లో రిలీజైన ఈ చిత్రం మహేష్ బాబుకు తొలి బ్లాక్ బస్టర్ ను ఇచ్చింది. ఈ సినిమాలోని ప్రత్యేక ఆకర్షణ చార్మినార్ సెట్., ఎందుకంటే అప్పటివరకు సినిమా సెట్టింగ్ కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైమ్ గుణశేఖర్ ఈ సినిమా కోసం 2 కోట్లతో చార్మినార్ సెట్ ను వేయించారు. అందుకే ఈ సినిమా సెట్ లిమ్కా బుక్ లోకి ఎక్కింది. అశోక్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
Advertisement
సెట్ ఎందుకు?
మహేష్ ను చార్మినార్ ప్రాంత కుర్రాడిగా , అతడి ఇళ్లు చార్మినార్ కు దగ్గరగా ఉందని చూపించే క్రమంలో ఈ సెట్ అవసరమైంది. ఈ సినిమా నిర్మాణ సమయంలో చార్మినార్ పైకి ఎక్కడానికి అనుమతి లేదు. దీంతో సెట్ నిర్మించడం అనివార్యమైంది.
Advertisement
Also Read: అమల ఏ దేశానికి చెందిన మహిళనో తెలుసా…ఆమె తల్లి ఎవరంటే…!
ప్లేస్:
సెట్ నిర్మాణం కోసం హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి చెందిన 10 ఎకరాల్లో చార్మినార్, అక్కడి ఇళ్లులు, దుకాణాల సెటప్ వేశారు. 300 మంది కార్మికులు మూడు నెలల పాటు కష్టపడి ఈ సెట్ వేశారు. దీని కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు అయ్యింది. సినిమా బడ్జెట్ 14 కోట్లు కావడం విశేషం!
ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ హరేరామా హరే కృష్ణ ఈ సెట్ లో తీసిందే….ఈ పాటను మే నెలలో తీశారు. ఈ పాట కోసం మహేష్ 45 డిగ్రీల ఎండలో 10 రోజుల పాటు కష్టపడ్డాడు.
Also Read: ఈ ముగ్గురు అక్క చెల్లెలతో కలిసి నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరో ఎవరంటే ?