Home » మహేష్ బాబు కొత్త సినిమా లుక్ విడుదల తేదీ ఫిక్స్…!

మహేష్ బాబు కొత్త సినిమా లుక్ విడుదల తేదీ ఫిక్స్…!

by Azhar
Ad
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు మహేష్ మాత్రం పాన్ ఇండియా సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు చేయబోతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. కానీ ఆ సినిమా కంటే ముందే ఇప్పటికే అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ సినిమా చేయడానికి మహేష్ సిద్ధమయ్యాడు. ఇది మహేష్ కెరియర్ లో 28వ సినిమాగా రాబోతుంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో 3వ సినిమా. ఇంతకముందే మీరిద్దరూ కలిసి అతడు, ఖలేజా సినిమా చేసారు.
ఇదిలా ఉంటె.. ఈ కొత్త సినిమా మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అందువల్ల మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు చాల రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చి గత నెల 12న అభిమానుల ముందుకు వచ్చింది. అయితే వచ్చిన రోజు సూపర్ హిట్ టాక్ తెచుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. కానీ ఆ తర్వాత మెల్లిగా సినిమా బాగాలేదు అనే టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా పడిపోయాయి.
అయితే ఇందులో హీరో మహేష్ బాబు కావడంతో…నిర్మాతలకు నష్టం కాలేదు. ఇదిలా ఉంటె.. ఈ సినిమాతో సంతృప్తి చెందని మహేష్ బాబ్ ఫ్యాన్స్… ఆయన కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ 28 వ సినిమా యొక్క ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. మహేష్ బాబు కొత్త సినిమా లుక్ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 9న అంటే మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా… త్రివికర్ సినిమాలోని ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు.. కానీ ఇదే నిజం అయితే మహేష్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి.

Advertisement

Visitors Are Also Reading