Home » మహేష్ బాబు దసరాకు ఏ కానుక ఇవ్వనున్నాడు..?

మహేష్ బాబు దసరాకు ఏ కానుక ఇవ్వనున్నాడు..?

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో ఒక్కడు. అయితే కరోనా కారణంగా రెండున్నరేళ్లు మహేష్ బాబు నుండి సినిమా అనేది రాలేదు. కానీ ఈ ఏడాది మేలో సర్కారు వారి పాట సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన మహేష్.. వారిని అంతగా మేపించలేకపోయాడు. అయితే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ సినిమా అనౌన్స్ మెంట్ అనేది ఎప్పుడో జరిగిన.. షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా ఈ మధ్యే ప్రారంభమైంది. దాంతో సూపర్ స్త్ర ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. అయితే వారి నిరాశను మహేష్, త్రివిక్రమ్ కలిసి ఎలా దూరం చేస్తారు అనేదాని గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఏ సినిమా నుండి అయిన పండుగలకు ఏదో ఒక అప్డేట్ అనేది వాస్తు ఉంటుంది.

Advertisement

ఇక వచ్చే నెల 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్దగా జరిపే దసరా పండుగా రానుంది. అయితే ఈ పండుగకు మహేష్ సినిమా నుండి ఏ అప్డేట్ వస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. దసరా కానుకగా ఈ సినిమా యొక్క టైటిల్ అనేది విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ లో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. మరి ఈ దసరాకు సినిమా టైటిల్ నే ప్రకటిస్తారా.. లేదా ఫస్ట్ లుక్ వంటిది ఏదైనా ఇస్తారా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

సంజూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న బీసీసీఐ..!

భారత జట్టులోకి ఉమ్రాన్ రీ ఎంట్రీ..?

Visitors Are Also Reading