Home » మహేష్ బాబు ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంటేనా..?

మహేష్ బాబు ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంటేనా..?

by Sravanthi
Ad

సాధారణంగా భారతీయులు ఏ పని చేయాలన్నా ఒక సెంటిమెంట్ మాత్రం పాటిస్తూ ఉంటారు. ఈ సెంటిమెంట్లు సాధారణ వ్యక్తుల నుంచి పెద్ద పెద్ద వాళ్ల వరకు ఉంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ఒక సెంటిమెంట్ ఉందట. ఆ సెంటిమెంట్ వల్లే ఆయన కెరియర్ లో చాలా డిజాస్టర్ సినిమాలు వచ్చాయట.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. రాజకుమారుడు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది.

Advertisement

ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. తన 27 సంవత్సరాల కెరియర్ లో త్రివిక్రం దర్శకత్వంలో తన 28వ సినిమాలో నటిస్తున్నారు. అయితే మహేష్ బాబు కెరియర్ లో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అయితే దీనికి ప్రధాన కారణం మే నెల అని అంటున్నారు. మే నెల సెంటిమెంట్ ఆయనకు అసలు కలిసి రాదట. మే నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే నిజం. తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 2003 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

ఎస్ జె సూర్య డైరెక్షన్లో మహేష్ నటించిన నాని కూడా 2014 మేలో వచ్చింది. అంతేకాకుండా మే నెలలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదే కాదు సర్కారు వారి పాట కూడా మే 12న రిలీజ్ అయ్యి ఓ మోస్తారు హిట్ అయింది తప్ప బ్లాక్ బాస్టర్ హిట్ కాలేకపోయింది. ఈ విధంగా మహేష్ బాబుకు మే నెల కలిసి రాని బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading