Home » తండ్రి రికార్డును బ్రేక్ చేయబోతున్న మహేష్ బాబు.. ఎలాగంటే..!!

తండ్రి రికార్డును బ్రేక్ చేయబోతున్న మహేష్ బాబు.. ఎలాగంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మహేష్ బాబు,కీర్తి సురేష్ ఇద్దరూ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ నటి నదియా, సుబ్బరాజు, తమిళ నటుడు సముద్రఖని, కమెడియన్ వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ముందు నుంచే అందరినీ అలరిస్తూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అనుకున్న టైమ్ లో రిలీజై ఆ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.ఈ విజయంతో సినిమా యూనిట్ మొత్తం ఆనందంలో మునుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక డాషింగ్ పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ద్వారా మహేష్ అభిమానులను ఎంతో సంతోషపెట్టాడు డైరెక్టర్ పరుశురాం. అయితే రిలీజైన రోజు నుండి వరుసగా భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా సోమవారం నుంచి కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. మెజారిటీ కేంద్రాలలో మూవీ చాలా బాగా రన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే వంద కోట్ల షేర్ ని రాబట్టింది. ఇంకా రాబోయే రోజుల్లో మహేష్ బాబు మేనియా తో ఈ సినిమా ఇంకా అందరినీ అలరిస్తుందని అంటున్నారు. ఒకప్పుడు సినిమాలు 50,100,250,350,500 రోజులు ఇలా సంవత్సరాల తరబడి ఆడిన సినిమాలు కూడా ఉండేవి. అప్పట్లో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు కూడా ఆ రోజుల్లో బాగా ఆడి మంచి పేరును తెచ్చుకున్నాయి. అయితే ఈ సందర్భంగా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా కూడా 500 రోజులు ఖచ్చితంగా ఆడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

Dethadi Harika : దేత్తడి హారిక డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

ఆ స్టార్ హీరో ని మించేలా ఎన్టీఆర్ సత్తాను చూపించబోతున్న డైరెక్టర్..!!

 

Visitors Are Also Reading