Telugu News » Ramesh Babu death : మహేష్ బాబును వెంటాడుతున్న వరుస ఇబ్బందులు…రెండు నెలల్లోనే ఎన్ని సమస్యలో…!

Ramesh Babu death : మహేష్ బాబును వెంటాడుతున్న వరుస ఇబ్బందులు…రెండు నెలల్లోనే ఎన్ని సమస్యలో…!

by AJAY MADDIBOINA

కొన్నిసార్లు అన్ని ఇబ్బందులు ఒకేసారి వస్తాయి. దాన్నే బ్యాడ్ టైం అంటారు. ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం అలాంటి బ్యాడ్ టైం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు వరుస ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే మహేష్ బాబు అనేక సమస్యలతో బాధపడ్డారు. డిసెంబర్ లో మహేష్ బాబు కు మోకాలి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మోకాలి సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లారు అక్కడ సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలోనే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Ads
Ramesh babu death

Ramesh babu death

కరోనా పాజిటివ్ వచ్చి మూడు రోజులు అవుతుంది అయితే ఇలాంటి సమయంలో నిన్న జనవరి 8న రాత్రి మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మృతి చెందారు. ఓ వైపు మహేష్ ప్రస్తుతం కరోనాంతో ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటూ ఉండగా మరోవైపు రమేష్ బాబు మృతి చెందడం బాధాకరం. దాంతో తాను ఎంతగానో ప్రేమించే అన్న అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు హాజరు అవ్వలేకపోతున్నారు. మహేష్ ను ఇబ్బందులు వెంటాడుతూ ఉండటం పై ఆయన అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Also read : రమేష్ బాబు ఆర్థిక ఇబ్బందులు పడకుండా మహేష్ ఏం చేశాడో తెలుసా…?

తమ అభిమాన హీరో త్వరగా కోలుకొని బయటకు రావాలని అనుకుంటున్నారు. మోకాలి సర్జరీ మరియు కరోనా పాజిటివ్ రావడం చిన్న సమస్యలే అయినా ఇప్పుడు రమేష్ బాబు మరణ వార్త మాత్రం మహేష్ బాబు ను తీవ్రంగా కలచివేసింది. దాంతో ఆయన కొద్దిరోజులు షూటింగ్ లకు సైతం గా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికైనా మహేష్ బాబు సమస్యల నుండి బయట పడాలని ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


You may also like