Home » తండ్రి కన్నుమూసిన రోజే మరొకరికి ప్రాణం పోసిన మహేష్ బాబు…. నెట్టింట ప్రశంసల జల్లు ..!

తండ్రి కన్నుమూసిన రోజే మరొకరికి ప్రాణం పోసిన మహేష్ బాబు…. నెట్టింట ప్రశంసల జల్లు ..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు తన చారిటీ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు చాలామంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇక తాజాగా మహేష్ బాబు ఓ మూడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించినట్టు తెలుస్తోంది. అయితే ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

కాగా మంగళవారం ఉదయం కృష్ణ తుది శ్వాస విడిచారు. అయితే అదే రోజున మహేష్ బాబు చారిటీ ద్వారా మూడేళ్ల బాబుకు గుండె ఆపరేషన్ జరిగింది. అంతేకాకుండా కృష్ణ మరణించిన కొన్ని గంటలు అటు ఇటుగా బాబుకు ఆపరేషన్ జరగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

వివరాలలోకి వెళితే….. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం కు చెందిన మోక్షిత్ సాయి అనే మూడేళ్ల బాబుకు మహేష్ బాబు హార్ట్ ఆపరేషన్ చేయించారు. మోక్షిత్ సాయి కి గుండెలో రంద్రం ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని సూచించగా మహేష్ బాబు టీం అతడిని చేరదీసింది.

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా బాబుకు చికిత్స అందించారు. అయితే బాబుకు వెంటనే ఆపరేషన్ చేయించాలని మహేష్ బాబు ఆదేశాలు జారీ చేశారట. దాంతో తండ్రి చనిపోయిన కొన్ని గంటలకే మరో బాబుకు ప్రాణం పోసిన మహేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు తండ్రి కృష్ణ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సైతం అదే దారిలో వెళుతున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading