టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు నటుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.
Advertisement
mahesh-babu-and-ramesh-babu
Ramesh Babu Ghattamaneni
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దాంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు అభిమానులు కూడా రమేష్ బాబు మృతి Ramesh Babu Gattamaneni పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేడు అభిమానులు, ప్రముఖుల మధ్య రమేష్ బాబు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Mahesh Babu Ramesh babu
ఈ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నారు. ఇక రమేష్ బాబు కుటుంబంలో కృష్ణ స్టార్ అయినప్పటికీ రమేష్ బాబు మాత్రం సినిమాల్లో రాణించలేకపోయారు. కానీ మహేష్ బాబు సైతం ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ బాబు కొన్ని ఆర్థిక బందులు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దాంతో తన అన్న రమేష్ బాబు ఎప్పుడూ ఆర్థికంగా వెనబడకుండా మహేష్ బాబు సపోర్ట్ చేస్తూ వచ్చారని సూపర్ స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రమేష్ బాబు కు పెద్దగా బయటకు రావడం ఇష్టం ఉండదని అందుకే సినిమాలకు దూరం అయ్యారని కృష్ణ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ మహేష్ మాత్రం రమేష్ బాబు సినిమాల్లోకి రావాలని సాయం చేసినట్టు తెలిపారు. అదేవిధంగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా మహేష్ బాబు కల్పించాలని కృష్ణ చెప్పారు.
Also read : గబ్బర్ సింగ్ లో శృతి వద్దన్న బండ్ల..కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?
మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమాను కూడా రమేష్ బాబు నిర్మించారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు రమేష్ బాబు కు ఎంతో గౌరవం ఇచ్చేవారని తెలుస్తోంది. రమేష్ బాబు ఫోన్ చేసినా కూడా మహేష్ బాబు ఎంతో గౌరవంగా నిలుచుని ఫోన్ మాట్లాడేవారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా పాజిటివ్ రావడంతో మహేష్ బాబు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. దాంతో తాను ఎంతగానో ప్రేమించిన అన్న అంత్యక్రియలకు సైతం దూరం అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement