Telugu News » Blog » “ఏమాయ చేసావే” సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా.?

“ఏమాయ చేసావే” సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా.?

by AJAY
Ads

నాగ‌చైత‌న్య కెరీర్ లోని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో ఏమాయ చేసావే సినిమా ఒక‌టి. తమిళ్ లో ఇదే సినిమాలో శింబు త్రిష హీరో హీరోయిన్లుగా న‌టించగా తెలుగులో నాగ‌చైత‌న్య స‌మంత‌లు జంట‌గా న‌టించారు. ఈ సినిమా ద్వారానే మొద‌ట నాగ‌చైత‌న్య‌కు న‌టుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా ల‌వ‌ర్ బాయ్ గా కూడా చైతూకు పేరు వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు క్లాసిక్ ప్రేమ‌క‌థ‌ల ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

Ads

 

 

సినిమాలో హీరో కంటే హీరోయిన్ పెద్ద వ‌య‌సు కావ‌డం అనే స‌రికొత్త కాన్స్పెట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. సింపుల్ అండ్ స్వీట్ గా ఉండే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. సినిమాలోని పాట‌లు కూడా ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి.

Ads
Ad

ఇక ఇదే సినిమాతో స‌మంత టాలీవుడ్ కు ప‌రిచ‌యం అవ్వ‌గా మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారు మ‌న‌సు దోచుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమాకు మొద‌ట‌గా మ‌త్రం గౌత‌మ్ మీన‌న్ నాగ‌చైత‌న్య‌ను హీరోగా అనుకోలేదు. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోను పెట్టి చేయాల‌ని అనుకున్నారు. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. గౌత‌మ్ మీనన్ ఈ సినిమా క‌థ‌ను మొద‌ట‌గా మ‌హేశ్ బాబుకు వినిపించారట‌.

Mahesh babu

Mahesh babu

కానీ మ‌హేశ్ బాబు ఈ సినిమాకు నో చెప్పేశారు. దాంతో గౌత‌మ్ మీన‌న్ ఈ సినిమా క‌థ‌తో నాగ‌చైత‌న్య వ‌ద్ద‌కు వెళ్లారు. క‌థ న‌చ్చ‌డంతో చైతూ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అలా ఏమాయ చేసావే సినిమా ప‌ట్టాలెక్కింది. నిజానికి చైతూకు ఈ సినిమా క‌థ చాలా బాగా సెట్ అయ్యింది. అయితే ఈ క‌థలో మ‌హేశ్ బాబు న‌టించి ఉంటే ఎలా ఉండేదో మీరే ఊహించుకోవాలి.