Home » రాజమౌళి పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్… నువ్వు జక్కన కాదు.. నక్కన అంటూ కామెంట్స్..!

రాజమౌళి పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్… నువ్వు జక్కన కాదు.. నక్కన అంటూ కామెంట్స్..!

by Azhar
Ad

ప్రస్తుతం తెలుగు అభిమానులను మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల రోజు పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అయినా… కొంతమంది సినిమాలో అంత సీన్ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…. ఈ సినిమా పై టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు.

Advertisement

ఎందుకంటే…. కరోనా తర్వాత వచ్చిన ప్రతి పెద్ద సినిమా పైన మహేష్ బాబు స్పందించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అఖండ. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ ఇలా ప్రతి సినిమా పైన మహేష్ బాబు తన రివ్యూ చాలా పాజిటివ్ గా ఇచ్చాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా పైన ఎవరు స్పందించడం లేదు. ఇదే విషయమై సూపర్ స్టార్ ఫ్యాన్ అసంతృప్తితో ఉన్న సమయంలో ఆర్ఆర్ఆర్ చేసిన ఓ ట్వీట్ వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది.

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క అధికారిక ట్విట్టర్ లో సర్కారు వారి పాట గురించి ఏం స్పందించలేదు…. కానీ తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసింది ఆర్ఆర్ఆర్ అకౌంట్. దాంతో మన తెలుగు సినిమాపై రాజమౌళి స్పందించలేదు… కానీ తమిళ సినిమా పైన స్పందిస్తున్నారు. మీరు జక్కన్న కాదు నక్కన అంటూ రాజమౌళి పై సీరియస్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబుతో తియనున్నాడు ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో మహేష్ ఫ్యాన్స్ జక్కన్న పై సీరియస్ అవ్వడం చర్చకు దారితీస్తోంది/

ఇవి కూడా చదవండి :

వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!

ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం..!

Visitors Are Also Reading