Home » టైటిల్ ద‌గ్గ‌ర నుండి “పోకిరి” క‌థ‌లో మ‌హేశ్ బాబు చేసిన మార్పులు ఇవే..!

టైటిల్ ద‌గ్గ‌ర నుండి “పోకిరి” క‌థ‌లో మ‌హేశ్ బాబు చేసిన మార్పులు ఇవే..!

by AJAY

మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో పోకిరి సినిమా ఒకటి. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఏప్రిల్ 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు బ్రేక్ చేసింది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చిత్రీకరణ సమయంలో…. దానికి ముందు కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం….. పూరి జగన్నాథ్ మహేష్ బాబుకు ఈ సినిమా కథను వినిపించే టప్పుడు పంజాబ్ కు చెందిన ఉత్తమ్ సింగ్ అనే ఓ అనాథ‌ పిల్లాడు మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అన్నది సినిమా కథ అని చెప్పాడట.

అయితే క్లైమాక్స్ మాత్రం అతడిని ఐపీఎస్ ఆఫీస‌ర్ గా చూపిస్తూ రివిల్ చేస్తామని చెప్పారట. సినిమా కథ విన్న వెంటనే మ‌హేశ్ బాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ సినిమా టైటిల్ ను ఉత్త‌మ్ సింగ్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని పూరి జగన్నాథ్ చెప్పారట. దాంతో పూరి పోకిరి అనే టైటిల్ ను చెప్పగా మహేష్ బాబుకు ఆ టైటిల్ చాలా నచ్చింది. ఇక అదే టైటిల్ తో ఈ సినిమా ఫిక్స్ అయ్యింది. అంతేకాకుండా ఈ సినిమాలో పూరి జగన్నాథ్ తన భార్యను ముద్దుగా పిలుచుకునే పండు అనే పేరును మహేష్ బాబుకు పెట్టారట.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇలియానాకు ముందు పూరి ఈ సినిమాను పార్వతీమెల్టన్ లేదంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తో చేయాలని అనుకున్నారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇలియానా పేరు చెప్పడంతో పూరీ ఇలియానాను ఆడిష‌న్స్ కు పిలిచారట. ఇక ఇలియానా ఈ కథకు సూటవుతుందని అనుకుని పూరీ ఆమెను హీరోయిన్ గా సెట్ చేశారు.

ఇక ఈ చిత్రం 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోగా మహేష్ బాబు అన్ని సీన్ల‌లోనూ సింగిల్ టేక్ లోనే నటించడం విశేషం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్ తర్వాత చాలామంది సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారట. కానీ మహేష్ బాబు పూరి జగన్నాథ్ మాత్రం సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండే వాడట. నిజానికి ఈ సినిమాకు మొదటిరోజు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. కానీ తర్వాత మెల్లి మెల్లి గా సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చి చివ‌రికి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది.

Visitors Are Also Reading