Home » ఎట్టకేలకు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల రహస్యాన్ని బయటపెట్టిన మధుబాల.. కారణం ఆ హీరోనే..?

ఎట్టకేలకు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల రహస్యాన్ని బయటపెట్టిన మధుబాల.. కారణం ఆ హీరోనే..?

by Mounika
Ad

ఇప్పటి జనరేషన్ కి మధుబాల అనే ఒక హీరోయిన్ ఉందని అంతగా తెలియకపోవచ్చు. కానీ సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నిఖిల్ కి తల్లిగా నటించిన నటి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. 1991లో కె బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్‌ చిత్రంతో వెండితెరకు పరిచయమైన మధు బాల… మణిరత్నం తీసిన రోజా సినిమాలో  పల్లెటూరి అమాయక పిల్లగా, పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర నుంచి భర్తను కాపాడుకునే ధైర్యవంతురాలుగా నటించి తన అద్భుతమైన నటనతో అందర్నీ ఇంప్రెస్ చేసింది మధుబాల.

Advertisement

హిందీ , తమిళం , తెలుగు , మలయాళం, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, , గణేష్ చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. తమిళమ్మాయి అయినా మధుబాలకు కేవలం తమిళంలోనే కాకుండా ఆమె నటించిన ప్రతి భాషలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. 1990 శతాబ్దంలో స్టార్ హీరోయిన్స్ కు సైతం మధుబాల గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి. నటించింది కొన్ని చిత్రాలే అయినా మధుబాల సినీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు ఒక దశాబ్దం పాటు హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని అందరికీ షాక్ ఇచ్చింది మధుబాల.

Advertisement

దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన ఒక విషయం గురించి తాజాగా ఓ కార్యక్రమంలో మధుబాల బయటపెట్టింది. అప్పటిలో బాలీవుడ్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. పూల్ ఔర్ కాంఠే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా నటించాను. ఎవరి పక్కానైతే హీరోయిన్ గా నటించానో అతని పక్కనే నన్ను తల్లి పాత్రలో నటించమని అడిగారు. కానీ నాకు అజయ్ దేవగణ్ తల్లిగా నటించడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఒకే వయసు, ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. కానీ నాకు మాత్రం ఎక్కువ వయసున్న రోల్స్ ఆఫర్ చేశారు. ఇది నాకు నచ్చలేదు.

వయసులో మాతో సమానమైన హీరోలు మాత్రం యాక్షన్ చేస్తుంటే, హీరోయిన్స్ మాత్రం ఇలా తల్లి పాత్రలు ఇవ్వడం అనే విషయం నాకు నచ్చలేదు. అందువలనే సినిమాలకు గుడ్ బై చెప్పేసాను అంటూ మధుబాల తను ఎదుర్కొన్న సంఘటనను ఇంతకాలం తర్వాత బయటపెట్టారు. ప్రస్తుతం మధుబాల మళ్లీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో తను ఇండస్ట్రీ వదిలేయడానికి గల కారణాన్ని ఇంత కాలానికి బయటపెట్టింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

మెగా హీరోల కూతుళ్లకు ఎందుకు ఇలా జరుగుతోంది.. ఏమైనా శాపం ఉందా..?

టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో.. యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమాలివే..!

చనిపోయిన పెద్దలు పితృ దేవతలు కాదు.. మరి పితృ దేవతలు అంటే ఎవరు..?

 

Visitors Are Also Reading