Home » బొక్కేం కాదు, వినేవాడు వీపీ అయితే అంటూ నాగార్జున పై మ‌ధ‌వీల‌త ఫైర్..!

బొక్కేం కాదు, వినేవాడు వీపీ అయితే అంటూ నాగార్జున పై మ‌ధ‌వీల‌త ఫైర్..!

by AJAY
Ad

టాలీవుడ్ న‌టి మాధ‌వి ల‌త హీరోయిన్ గా చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. అందం అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ మాధ‌వీల‌త అవ‌కాశాలు మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది. స్నేహితుడే, న‌చ్చావులే సినిమాలు త‌ప్ప మాధ‌విల‌త కెరీర్ లో గుర్తుపెట్టుకునే సినిమాలు లేవు. ఇక సినిమా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో కొన్ని రోజులు సీరియ‌ల్స్ లోనూ మాధ‌వీల‌త న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే కొంత‌కాలంగా మాత్రం మాధ‌వీల‌త రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Madhavi latha

Madhavi latha

బీజేపీ పార్టీలో చేరిన మాధ‌వీల‌త గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయాల్లో చురుకుగా ప‌నిచేసింది. సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ప‌లు సామాజిక రాజ‌కీయ అంశాల‌పై స్పందిస్తూ ఉండేది. కానీ కొంత కాలం నుండి రాజ‌కీయాల్లోనూ పెద్ద‌గా యాక్టివ్ గా క‌నిపించ‌డం లేదు. ఇదిలా ఉంటే గ‌తంతో మాధ‌విల‌త బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందంటూ ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాను పోవ‌డంలేద‌ని మాధ‌వి ల‌త ఆ వార్త‌ల‌ను కొట్టిపారేసింది.

Advertisement

Advertisement

ఇక ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్ర‌సారం అవుతోంది. ఓటీటీలో ప్ర‌సారం అవుతున్న ఈ సీజ‌న్ ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ మాధ‌వీ ల‌త మాత్రం ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల మాధ‌వీల‌త… బింధ‌మాద‌వి మ‌రియు న‌ట‌రాజ్ ల మ‌ధ్య జ‌రిగిన ఓ గొడ‌వ గురించి స్పందింది. ప్రాంతీయ‌త పై వ‌చ్చిన ఈ గొడ‌వలో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ మాట్లాడుతూ బింధు మాదవి తెలుగ‌మ్మాయి అయినా త‌మిల‌నాడు వెళ్లి సినిమాలు చేసింద‌ని అక్క‌డ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో తెలుగు బిగ్ బాస్ కు వ‌చ్చింద‌ని అన్నాడు.

కానీ తాను ఇక్క‌డే ఉన్నాన‌ని చెప్పాడు. ఈ గొడ‌వ‌పై నాగార్జున న‌ట‌రాజ్ కు క్లాస్ తీసుకున్నాడు. వ‌న్ ఇండ‌స్ట్రీ..వ‌న్ నేష‌న్ అంటూ కామెంట్స్ చేశాడు. ఇక న‌ట‌రాజ్ మాస్ట‌ర్ కు చుర‌క‌లు అంటించ‌డం పై మాధ‌వి ల‌త త‌న సోష‌ల్ మీడియా ద్వారా వ‌రుస పోస్టులు చేస్తూ ఫైర్ అయ్యింది. వ‌న్ కంట్రీ వ‌న్ ఇండ‌స్ట్రీనా బొక్కేం కాదు. ఇక్క‌డి వాళ్ల‌కే మ‌న ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు లేవంటే త‌మిళ‌నాడుకు వెళ్ల‌మంటున్నాడు. వినే వాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మావ అంటూ మాధ‌వీల‌త ఫైర్ అయ్యింది.

AlSo READ :

“అశోక వనం లో అర్జున కళ్యాణం” సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

Visitors Are Also Reading