Telugu News » వీజే స‌న్నీని మాధ‌వీల‌త షాకింగ్ కామెంట్స్ !

వీజే స‌న్నీని మాధ‌వీల‌త షాకింగ్ కామెంట్స్ !

by Bunty

త‌న ఆలోచ‌న‌ల‌ను వ్య‌క్తీ క‌రించ‌డంలో ఎప్పుడు వెనుక‌డుగు వేయ‌ని తార‌ల‌లో మాధ‌విల‌త ఒక‌రు. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో, స్టోరీల‌లో ఇలా రాసారు. బిగ్‌బాస్ తెలుగు విజేత వీజే స‌న్నీ త‌న‌కు చాలా మ‌ద్ద‌తు ఇచ్చిన ఫ్యాన్ పేజీల‌ను.. కొన్ని యూట్యూబ్ ఛాన‌ల్‌ల‌ను విస్మ‌రిస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఎక్కువ మంది స‌బ్ స్క్రైబ‌ర్లు, టీవీ ఛాన‌ల్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్‌కు వీజే స‌న్నీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నార‌ని ఆమె ఆరోపించింది.

Ads

 

బిగ్‌బాస్ హౌస్‌లో స‌న్నీ ఆట‌కు తాను చాలా స‌పోర్టు చేశాను అని మాధ‌వీల‌త పేర్కొంది. ఎవ‌రు అయినా త‌ప్పు చేస్తే విమ‌ర్శించ‌డానికి విమ‌ర్శించ‌డానికి అయినా ఆ త‌ప్పును ఎత్తి చూప‌డానికి తాను వెన‌కాడ‌ను అంటూ స్ప‌ష్టం చేసింది. ఇత‌రుల‌కు కృత‌జ్ఞ‌త భావం చూప‌ని వారిని తాను ఇష్ట‌ప‌డను అని చెప్పింది. ఇక ఆమె పోస్ట్ చేసిన దానిలో ఏముందంటే.. స‌న్నీ కోసం ఎంత మంది పీఆర్ లా మారిపోయారు. అంద‌రికీ థాంక్యూ అని ఒక మాట చెబితే ఐపోదా స‌న్నీ అని విమ‌ర్శించారు. స‌న్నీనీ గొప్ప‌గా ప్రొజెక్ట్ చేసే యూట్యూబ్ రివ్యూవ‌ర్ ఉన్నారు. క‌నీసం వాళ్ల పేర్లు కూడా మెన్ష‌న్ చేసాడా..? అత‌ని కంటే తెలియ‌దు.. క‌నీసం స‌న్నీ స్నేహితుల‌కైనా తెలియ‌దా..? క‌ళ్లు నెత్తికి ఎక్కాయా..? ఫ‌స్ట్ ప్రియారిటీ ఎవ‌రికీ ఇవ్వాలి. ముఖ్యంగా మీడియా నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి మీడియాకే తొలి ప్రాధాన్య‌త ఇస్తాన‌ని స‌న్నీ బిస్కేట్ బాగానే ఉంద‌ని ఆమె స్టోరీలో రాసింది.

 

సాధార‌ణ జ‌నానికి విలువ ఇవ్వ‌క‌పోతే అక్క‌డే ఆగిపోతావు గుర్తుంచుకో. ఫ్యాన్ పేజీల‌ను క్రియేట్ చేసిన ఒక‌రికీ స‌న్నీ నుంచి ఎటువంటి ఫోన్ మిసేజ్ రాలేదు. పాపం వాళ్లు అంద‌రూ స‌న్నీ ఏడిస్తే ఏడ్చారు. స‌న్నీ న‌వ్వితే న‌వ్వారు. వారం రోజులు గ‌డిచినా ఇంకా టాప్ ఛాన‌ల్స్‌తోనే బిజీగా ఉండ‌డం త‌ప్పు, నాకు అయితే న‌చ్చ‌డం లేదు. నాకు కోపం వ‌స్తే అదే మీడియాలో నిల‌బెట్టి క‌డిగేస్తా.. న‌చ్చితే నెత్తిన పెట్టుకుంటాను. తిక్క లేస్తే తాట తీసి ఆరేస్తాను అని మాధ‌వీల‌త వార్నింగ్ ఇచ్చింది. దీనిపై స‌న్నీ ఏవిధంగా స్పందిస్తాదడో వేచి చూడాలి మ‌రీ.

 


You may also like