Home » మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ చూశారా..? నితిన్ డైలాగ్స్ మామూలుగా లేవు క‌దా..!

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ చూశారా..? నితిన్ డైలాగ్స్ మామూలుగా లేవు క‌దా..!

by Anji
Ad

హిట్ ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో నితిన్‌. ఇక ఈ యంగ్ హీరో నితిన్‌, కృతిశెట్టి జంట‌గా న‌టిస్తున్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌ముక నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. డైరెక్ట‌ర్ ఎం.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు ఈ సినిమాపై ఆస‌క్తి పెంచాయి. ఎప్పుడెప్పుడు అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Advertisement

తాజాగా మాచ‌ర్య నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్ విడుద‌ల చేసింది ఈ చిత్ర యూనిట్‌. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. క‌లెక్ట‌ర్ గా నితిన్ లుక్ అదిరిపోయింద‌నే చెప్పాలి. నువ్వు ఏమో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ లా పంచ్‌లు.. వీళ్లేమో బోయ‌పాటి శ్రీ‌ను మాదిరిగా యాక్ష‌న్ సీన్స్‌.. ఇక ఇప్పుడు నేనేం చేయాలి. రాజ‌మౌళి హీరోలా ఎలివేష‌న్ ఇవ్వాలా అంటూ నితిన్ చెప్పే డైలాగ్ లు అదిరిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో పాటు యాక్ష‌న్ తో తీర్చిదిద్దిన‌ట్టు ట్రైల‌ర్ అర్థం అవుతోంది. ఇందులో కేథ‌రిన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. హీరోయిన్ అంజ‌లి స్పెష‌ల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో రారా రెడ్డి అనే సాంగ్ అయితే అధిక వ్యూస్ తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ పాట‌లో వ‌చ్చే రాను రాను అంటూనే చిన్న‌దో అనే బీట్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈపాట‌తో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పుల‌ను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేశాయి. ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది ఈ సినిమా. 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైల‌ర్ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్ష‌న్ సీన్ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంది. ట్రైల‌ర్ లో చూపించిన డైలాగ్ లు నితిన్ యాక్ష‌న్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయ‌నే చెప్పాలి. ఇంకా డైరెక్ట్ యాక్ష‌న్ అని ఈ మూవీ ట్రైల‌ర్ ను ట్వీట్ చేశాడు హీరో నితిన్‌.

Also Read : 

ఆ బాలీవుడ్ హీరోకి ఇల్లు అమ్మిన జాన్వీక‌పూర్‌.. ఎన్ని కోట్ల లాభం వ‌చ్చిందంటే..?

ఎన్టీఆర్ ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading