Home » కరాటే కళ్యాణికి ఝలక్ ఇచ్చిన ‘మా’.. అందుకోసమేనా ?

కరాటే కళ్యాణికి ఝలక్ ఇచ్చిన ‘మా’.. అందుకోసమేనా ?

by Anji
Ad

నటి కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ ఝలక్ ఇచ్చింది. మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్ మే 16న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్టుమా సభ్యులు తెలిపారు.

Advertisement

ఈనెల 16న తేదీన మేము పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలో వివరణను ఫైల్ చేయడంలో మీరు విఫలం చెందారు. ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేయగా.. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడంతో మా సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది.  మా అసోసియేషన్ ఇవాళ చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది అని కరాటే కళ్యాణికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరీ. 

Advertisement

ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విగ్రహం కృష్ణుడి రూపంలో పోలి ఉంటుందని కరాటే కళ్యాణి కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.దీంతో తరువాత తీర్పును ఇచ్చే వరకు విగ్రహావిష్కరణను ఆపాలని కోర్టు స్టే విధించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్నారైలు విగ్రహంలో స్వల్ప మార్పులు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు. మే 28న  ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం విధితమే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రోహిణి కార్తేకు రోళ్లు పగులుతాయని ఎందుకు అంటారో తెలుసా ?

విరాట్ కోహ్లీ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశారా ?

Visitors Are Also Reading