ప్రముఖ కవి, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కందికొండ అకాల మరణంతో సినీ పరిశ్రమ అంతా ఒక్కసారిగా షాక్కు గురయింది.
Advertisement
సినిమా పాటకు తెలంగాణ యాసను అద్దిన కవులలో కందికొండ ఒకరు తెలంగాణ యాసలో పాటలు రాయడం.. బతుకమ్మ పాటలను ప్రపంచానికి పరిచయం చేశారు. పలు చిత్రాలలో సూపర్ హిట్ పాటలు రాసిన కందికొండ.. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. క్యాన్సర్ మహమ్మారితో దాదాపు రెండేండ్లు పోరాడిన కందికొండ ప్రస్తుతం పెరాసిస్ సమస్యతో బాధపడుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం కీమోథెరపీ చేయించుకోవడంతో కందికొండ స్పై నల్ కార్డులోని సీ 1 సీ2 భాగాలు దెబ్బతిన్నాయి.
Advertisement
దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కందికొండ నడవలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కందికొండ ఆర్థిక సాయం ఎదురుచూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కందికొండ ఈరోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.