ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 14 ఓవర్ల వరకు మ్యాచ్ చాలా థ్రిల్లర్ ను తలపించింది. 14 ఓవర్ల వరకు లక్నో వైపు ఉండగా.. చివరి 5 ఓవర్లలో అసలు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 106 పరుగులతో చాలా పటిష్టంగా కనిపించింది లక్నో సూపర్ జెయింట్. మిగతా ఆరు ఓవర్లలో లో 22 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 128 పరుగులు మాత్రమే చేసింది. ఒక రకంగా ఓడిపోతుందనుకున్న గుజరాత్ 7 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.
Also Read : బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement
లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ అదే రాహుల్ మ్యాచ్ ఓటమికి కారణమయ్యాడంటే ఎవరూ నమ్మరు. కానీ అక్షరాల ఇది సత్యం. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అప్పటికీ 35 బంతుల్లో 30 పరుగులు చేయాలి. ఎవరైనా లక్నో గెలుస్తుందని.. ఈజీగా 30 పరుగులు చేస్తుందనుకుంటారు. ఇక చేజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాటర్ హాప్ సెంచరీ చేయడంతో చివరి వరకు నిలిచాడు అంటే ఎవరైనా మ్యాచ్ ని గెలిపిస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడే సీన్ కాస్త రివర్స్ అయింది.చివరి వరకు క్రీజ్ లో ఉన్న రాహుల్ చివరి ఓవర్ లో రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఈజీగా గెలిపించాల్సిన మ్యాచ్ ని ఎక్కడ లేని ఒత్తిడి నెత్తిమీదకు వేసుకొని మరీ దగ్గరుండి లక్నోను ఓడించాడు.
Advertisement
Also Read : DK లాగే… భార్య చేతిలో మోసపోయిన బాధితులు వీళ్లే…!
మరో విచిత్రం ఏంటంటే.. 38 బంతుల్లో 50 పరుగులు సాధించిన రాహుల్ ఆ తర్వాత 18 పరుగులకు 23 బంతులు తీసుకోవడం చూస్తే అతను ఎంత చెత్తగా ఆడాడో స్పష్టం అవుతుంది. అందుకే కేల్ రాహుల్ బ్యాటింగ్ ని ట్రోల్ చేయడం, సోషల్ మీడియాలో అభిమానులు పెట్టిన మీ మ్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో 60 బంతులు ఎదుర్కొని అత్యంత చెత్త స్ట్రైక్ రేటు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ నిలిచాడు. తాాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 61 బంతుల్లో 68 పరుగులు చేసిన రాహుల్ స్ట్రైక్ రేట్ 111.48 గా ఉంది. ఈ జాబితాలో రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో డుమిని 59 పరుగులు 63 బంతులు 93.65 స్ట్రైక్ రేట్, రెండో స్థానంలో అరోన్ ఫించ్ 62 బంతుల్లో 68 పరుగులు..109.68 స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు.
Also Read : నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన