Home » విదేశాలలో తీసిన తొలి మెగాస్టార్ చిత్రం!?

విదేశాలలో తీసిన తొలి మెగాస్టార్ చిత్రం!?

by Azhar
Ad

చిరంజీవి అంటే చాలు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన టాప్ హీరో అంటారు. మొద‌ట్లో చిరంజీవికి గెస్ట్ పాత్రలతో పాటు నెగెటివ్ రోల్స్ ఉండే పాత్రలు వచ్చేవి. విల‌న్ క్యారెక్ట‌ర్స్ చేసేవాళ్ళు. అప్పటికి ఆయ‌న‌కు పెళ్లి కూడా అవ్వ‌లేదు. అయితే తన నటనతో ఆ పాత్రల్లో రక్తికట్టించిన చిరంజీవి లవ్ ఇన్ సింగపూర్ మూవీలో నటించాడు. ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్. వి. ఎస్ ఫిలిమ్స్ అధినేతలు నిర్మించారు. సరిగ్గా 4 దశాబ్దాల క్రితం తీసిన ఈ మూవీలో రంగనాథ్, చిరంజీవి హీరోలుగా నటించినప్పటికీ, ఆ రోజుల్లో చిరంజీవికి ఉన్న క్రేజ్ వేరు. చిరంజీవి చిత్రంగా నిర్మాతలు ప్రచారం చేసారు. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగు వెర్షన్ కి ఓ ఎస్ ఆర్ ఆంజనేయులు, మలయాళ చిత్రానికి బేబీ దర్శకత్వం వహించారు. తెలుగులో రంగనాథ్, చిరంజీవి, లత నటించగా, మలయాళంలో ప్రేమ్ నజీర్, సైమన్, లత నటించారు.

Also Read: గొంతులో బుల్లెట్ దిగిన వ్య‌క్తిని కాపాడిన హీరో రాజ‌శేఖ‌ర్…అప్ప‌ట్లో సెన్సేష‌నల్ న్యూస్.!

Advertisement

Advertisement

రంగనాథ్ పోలీస్ ఆఫీసర్ గా, ఆయన తమ్ముడిగా చిరంజీవి నటించిన ఈ చిత్రం అంతర్జాతీయ స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కింది. సింగపూర్ అందాలను వెండితెరపై అందంగా ఆవిష్కరించిన ఈ చిత్రం తన కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ గా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి భావిస్తాడు. ఈ మూవీతోనే జోష్ ప్రకాష్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియాలో దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ సాగింది. ఆ రోజుల్లోనే విదేశీ షూటింగ్ అంటే మాములు విష‌య‌మా మ‌రి. చిరంజీవి విదేశాల్లో జరుపుకున్న తొలి సినిమా షూటింగ్ ఇదే కావడం అప్ప‌ట్లో ఓ విశేషం. ముఖ్యంగా చిరంజీవి క్లాప్ కొట్టి తన చేతుల మీదుగా ప్రారంభించిన తొలి సినిమా ఇదే. ఇక షూటింగ్ కోసం చిరంజీవి విదేశాలకు వెళ్లడం కూడా ఇదే మొద‌టిసారి.

ఇక చిరంజీవి సరసన సింగపూర్ ప్రముఖ మోడల్ మెడెలిన్ నటించింది. అంతేకాదు, ఈ మూవీలో జూనియర్ ఆర్టిస్టులంతా సింగపూర్ వాళ్లే. ఇంతకీ ఆ రోజుల్లో సింగపూర్లో చిత్ర పరిశ్రమ అనేది లేకపోవడం, కేవలం యాడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన చిన్న చిన్న ప్రకటనలు మాత్రమే షూటింగ్ జరుగుతుండడం వలన సింగపూర్ వాసులకు సినిమా షూటింగ్ అంటే ఇష్టం. సినిమా షూటింగ్ ఎక్కడ చేసినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించేవారు. అక్కడ చిత్రీకరణ కూడా చాలా ఈజీగా అనుమతి వచ్చేది. అందుకే అక్కడి ప్రజల సహకారంతో మూడొంతుల చిత్రాన్ని అతి తక్కువ కాలంలో షూట్ చేశారట.

Also Read: హీరోయిన్ శోభన పెళ్లిచేసుకోకపోవటానికి కారణం ఆ హీరో నేనట !

Visitors Are Also Reading