సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు విడాకులు కామన్ అయిపోయాయి. అదేవిధంగా ప్రేమించుకుని డేటింగ్ చేసి ఆ తరవాత పెళ్లి వరకూ వెళ్లి కూడా ఆగిపోయిన జంటలు ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు కానీ హీరోయిన్లు మాత్రం లవ్ ఫెయిల్యూర్ లు గా మిగిలిపోయారు. అలా టాలీవుడ్ లో లవ్ ఫెయిల్ అయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
టాలీవుడ్ అందాల తార సమంత మొదట హీరో సిద్దార్థ్ తో ప్రేమలో పడింది. ఆ తరవాత ఏం జరిగిందో కానీ ఇద్దరూ విడిపోయారు. మళ్ళీ ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్య తో సమంత ప్రేమలో పడింది. ఇద్దరి మనసులు కలవడం తో పెళ్ళి చేసుకున్నారు. కానీ మనస్పర్థలు రావడంతో రీసెంట్ గా విడాకులు తీసుకున్నారు.
రష్మిక మందన
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రాష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం నడిపించింది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ టాలీవుడ్ లో బిజీగా మారిన రష్మిక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. రష్మిక నో చెప్పడం వల్లే పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
Advertisement
మెహ్రీన్
టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ వివాహం కూడా పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. భవ్య బిస్నోయ్ అనే యువ రాజకీయ నాయకుడితో మేహరీన్ ప్రేమాయణం నడిపించింది. కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవల కారణం గా ఇద్దరూ విడిపోయారు.
నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార హవా కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. నయనతార కెరీర్ మొదట్లో తమిళ హీరో శింబు తో ప్రేమలో పడింది. కానీ ఆ తరవాత ఇద్దరూ విడిపోయారు. అనంతరం కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు ప్రభుదేవా తో ప్రేమాయణం నడిపింది. పెళ్లి పీటల వరకు వెళ్లిన వీరి ప్రేమ కూడా పెటాకులు అయ్యింది.
త్రిష
టాలీవుడ్ బ్యూటీ త్రిష కూడా తన కెరీర్ మొదట్లో హీరో శింబు తో ప్రేమాయణం నడిపింది. కానీ ఆ తరవాత ఇద్దరూ విడిపోయారు. అనంతరం త్రిష మరో తమిళ దర్శకుడితో ప్రేమలో పడింది. వీరి పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది.