ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం హెల్దే ఫుడ్ తీసుకోవాలి. కేవలం మంచి ఆహారం వల్ల బరువు పెంచుకోవడం, తగ్గించుకోవడం, గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అందుకోసం కొన్ని పదార్థాలు తినాలి. దీంతో సరైన బరువు సరిగ్గా మెయింటైన్ అవ్వడంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Advertisement
ఒక కప్పు శనగల్లో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటితో పాటు ఐరన్ కంటెంట్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిని తింటే బరువు తగ్గుతారు. పనీర్ లో కూడా క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ బి 12, ఫాస్ఫరస్, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ బరువుని మేనేజ్ చేస్తాయి. ఇక ఆకుకూరలు చాలా మంచిది. వీటిలో పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఆకలి తగ్గుతుంది. దీంతో అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటి వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. సరిగ్గా వీటిని తింటే బరువు కంట్రోల్ అవుతుందనడంలో సందేహమే లేదు.
Advertisement
బాదంలో ఎల్ అర్జినైన్ అనే ఆమైనో యాసిడ్ ఉంటుంది. ఇది వర్కౌట్ టైమ్ లో ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ జర్నల్ ప్రకారం, వర్క్ అవుట్ కి ముందు బాదం తీసుకోవడం మంచిది. చాలా మంది ఇళ్లల్లో పప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు. ఈ పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్స్ ఉంటాయి. దీంతో కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా బాడీలోకి చేరతాయి. దీనివల్ల బరువుని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న బ్రకోలీ తింటే హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. దీంతో బరువు తగ్గుతారు.
మరికొన్ని తెలుగు లైఫ్ స్టైల్ వార్తలకు ఇక్కడ చూడండి.