Home » శివుడికి పొరపాటున కూడా వీటితో అభిషేకం చేయరాదట..!!

శివుడికి పొరపాటున కూడా వీటితో అభిషేకం చేయరాదట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

భారతదేశం అంటేనే సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా గుళ్ళు,గోపురాలు వంటివి ఎక్కువగా ఉంటాయి.. భారతదేశంలో చాలా మంది శివుడిణి చాలా ఇష్టంగా పూజిస్తూ ఉంటారు. శివుడు సర్వలోక రక్షకుడు అని , ఆయనను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు..ఇక శివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.. మరి శివానుగ్రహం పొందాలంటే వీటీతో మాత్రం అస్సలు అభిషేకం చేయరాదట.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

సాధారణంగా శివలింగానికి రుద్రయాగం,రుద్రాభిషేకం వంటి పూజలు చేస్తుంటారు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు బిల్వర్చన, ప్రతి నెల మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. ముఖ్యంగా విభూదితో అభిషేకం శివునికి ఎంతో ఇష్టమట. అంతేకాకుండా జలాభిషేకం అయితే బోలా శంకరునికి చాలా ప్రీతి. మరి అలాంటి శివుడికి కొన్నింటితో అసలు పూజ చేయకూడదని పండితులు అంటున్నారు.. సాధారణంగా శివుడిని పసుపు, కుంకుమలతో పూజిస్తారు.

Advertisement

కానీ శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు కుంకుమలను వాడకూడదట. శివుడిని త్రినేత్రుడు అని పిలుస్తారు. కాబట్టి శివునికి మూడో కన్ను ఎక్కడైతే ఉంటుందో అక్కడ పసుపు, కుంకుమ అస్సలు పెట్టకూడదు. అయితే శివుడు శంకచుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. కాబట్టి శివున్ని శంఖంలో పూసిన నీళ్లతో అసలు అభిషేకం చేయకూడదని అంటారు. అంతేకాకుండా తులసి ఆకులను కూడా శివ పూజకు వాడకూడదు. అలాగే మనం తాగే కొబ్బరి నీళ్లతో కూడా శివుడికి అభిషేకించకూడదని అంటారు పండితులు.

also read:

Visitors Are Also Reading