శ్రీ కృష్ణుడి తలపై నెమలి పింఛం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమే చేసేవాడు. అల్లరి చేయడం, అల్లరి పెట్టడం అంతవరకే గాని ఏనాడు కూడా హద్దుమీరి ప్రవర్తించలేదు. గోపికలు కృష్ణుడు మధ్య ఉన్నటువంటిది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు మన అందరికీ కూడా ఒక భోగి గా కనిపించే యోగి. ఇక నెమలిపింఛం విషయానికి వస్తే.. నెమలి ప్రపంచంలో సంభోగం చెయ్యని ఒకే ఒక్క జీవి,అలాగే అత్యంత పవిత్రమైన జీవి కూడా. అందుకే మన దేశానికి జాతీయ పక్షి గా ప్రకటించారు. మరి పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు.అందుకే నెమలి ఫించం తలపై ఉండి శ్రీకృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది. అక్కడ విషయం ఏమిటంటే కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అంటే స్కలనం ఎరుగనివాడు. నెమలి పరవశించినప్పుడు మగ నెమలి అశృధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందుతుందట. అంతే కానీ అవి సంభోగించవు.అందుకే కృష్ణ భగవానుడి తలపై నెమలి పించం ధరిస్తాడు.
Advertisement
also read :
Advertisement
గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!
రావి చెట్టును ఏ రోజుల్లో తాకితే పాపం కలుగుతుంది..!!