ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరు ఈసారి గెలుస్తారు అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణలతో ఇన్చార్జ్ లని మారుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ కూడా పెరుగుతుంది. టిడిపి జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ సీఎం కావాలని అభిమానులు జనసైనికులు ఆశపడుతున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చంద్రబాబు, పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారని చర్చ జోరుగా సాగుతోంది.
Advertisement
ఈ సమయంలో లోకేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా జగన్ ని ఓడించాలని లక్ష్యంతో ఉన్నారు అంతా సీఎం పదవి గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి గురించి డిమాండ్ చేద్దామని అన్నారు. అభిమానులు మాత్రం పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. టీడీపీ జనసేన మధ్య సీట్లతో పాటుగా అధికారంలోను షేరింగ్ ఉంటుందని దీని ద్వారా చంద్రబాబు పవన్ సీఎం పదవిని పంచుకుంటారని అభిప్రాయం బలంగా కనపడుతోంది.
Advertisement
ఈ టైం లో టిడిపి ముఖ్య నేత నారా లోకేష్ సీట్లు పంపకాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి షేరింగ్ కాదు అని చెప్పారు. ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ చేసిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసారు లోకేష్ ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం ఉంటుందని అడిగితే రెండవ ఆలోచన లేదని చెప్పారు చాలా స్పష్టంగా ఉన్నామని చంద్రబాబు సీఎం అవుతారని గట్టిగా చెప్పేశారు. అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పవన్ కూడా చెప్పినట్లు గుర్తు చేశారు ఇందులో ఎటువంటి సందేహాలు కూడా లేనట్లు లోకేష్ చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి టిడిపి జనసేన ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిందంటే చంద్రబాబు మాత్రమే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!