దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకున్న కరోనా కొత్త వేరియంట్ ఒమీక్రాన్ ప్రపంచదేశాలను ప్రస్తుతం గడగడ లాడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ 90 దేశాలకు పైగా వ్యాప్తి చెందిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మన ఇండియాలోనూ దాదాపు రాష్ట్రాలకు వ్యాపించింది ఈ కొత్త వేరియంట్. ప్రస్తుతం మన దేశంలో 250 కి చేరాయి ఒమీక్రాన్ కేసులు. ఈ తరుణంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అలర్ట్ అయ్యాయి. ఏ సమయంలోనైనా దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
డిసెంబర్ 31వ తేదీ వరకు భారత్ బంధు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు లాక్డౌన్ విధించే సూచనలు ఉన్నట్లు ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్యాక్ టీం ఖండించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ ప్రచారాన్ని నమ్మకూడదని ప్రజలకు సూచనలు చేసింది.