Home » స్థానిక ఎన్నికలకు స‌బంధించి ఎస్ఈసీని హై కోర్టు ఏమ‌న్న‌దో తెలుసా..?

స్థానిక ఎన్నికలకు స‌బంధించి ఎస్ఈసీని హై కోర్టు ఏమ‌న్న‌దో తెలుసా..?

by Sravan Sunku
Published: Last Updated on
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని స్థానిక సంస్థ‌గ‌త ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం విధిత‌మే. తాజాగా కొన్ని ప‌రిణామ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. అయితే తాజాజా ఈ కేసు హై కోర్టులో విచార‌ణ జ‌రిగిన‌ది. స్థానిక సంస్థాగత ఎన్నికలలో ఎస్ఈసీ తీరును హైకోర్టు త‌ప్పుబ‌ట్టిన‌ది. ఈస్ట్ గోదావరి పెద్దాపురం పులిమేరు ఎంపీటీసీ 25 బూతుల‌లో రీ పోలింగ్ నిర్వహించాలని గతంలో ఎస్ఈసీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌స్తుతం మాత్రం కేవ‌లం 24, 25, 26 బూత్‌ల‌లో నూత‌నంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.

 

Advertisement

Advertisement

ఎస్ఈసీ నిర్ణ‌యాన్ని సవాల్ చేస్తూ జనసేన అభ్యర్థి హైకోర్టును ఆశ్ర‌యించారు. గత ఎన్నికల్లో కౌంటింగ్ సమయంలో 25 బూతు కౌంటింగ్ బాక్స్ లో కొన్ని ఓట్లు చెదలుపట్టాయని,ఈ నేపథ్యంలో 25 బూతులో రీ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్,SEC ఆదేశాలు ఇచ్చారని ధర్మాసనంకు జనసేన లీగల్ చైర్మన్ సాంబశివప్రతాప్ వివ‌రించారు. గతంలో కౌంటింగ్ సమయంలో జనసేన అభ్యర్థికి 100 ఓట్లు మెజారిటీ వచ్చిందని న్యాయవాది వివ‌రించారు. మళ్ళీ ఇప్పుడు 24,25,26 బూతులలో కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ రెండో సారి నోటిఫికేషన్ ఇచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకు వ‌చ్చారు న్యాయవాది. రెండో సారి విడుదల చేసిన ఎస్ఈసీ నోటిఫికేషన్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. తొలుత 25వ బూత్‌కు మాత్ర‌మే రీపోలింగ్ ప్ర‌క‌టించి, త‌రువాత 24, 25, 26 బూత్‌ల‌లో కొత్త‌గా ఎన్నిక‌లు పెట్ట‌డం ఏమిట‌ని ధ‌ర్మాస‌నం ప్రశ్నించింది. అందుకు ఎస్ఈసీ స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Visitors Are Also Reading