బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా చాలా మంది సెలబ్రెటీలకు లైఫ్ వచ్చింది. అందులో సోహెల్ కూడా ఒకరు. సోహెల్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. అంతే కాకుండా సీరియల్స్ లోనూ నటించాడు. అయితే సోహెల్ వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి.. ఆయన తండ్రి సింగరేణిలో కార్మికుడు. అలాంటి బ్యాగ్రౌండ్ నుండి సోహెల్ బిగ్ బాస్ వరకూ వచ్చాడు. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన తరవాత మాత్రం అతడి లైఫ్ మారిపోయింది.
Advertisement
ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తరవాత చాలా సినిమా అవకాశాలను అందకున్నాడు. ఇక సోహెల్ నటించిన లక్కి లక్ష్మణ్ సినిమా విడుదల కు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో ప్రమోషన్స్ లో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో ఓ వీడియో చేసేందుకు వైజాగ్ వెళ్లాడు.
Advertisement
Advertisement
లోకల్ బాయ్ నాని మత్స్యకారుడు కాగా సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా మహాసముద్రం సినిమాలో నటించాడు కూడా. ఇక సోహైల్ అతడి ఛానల్ లో ప్రమోషన్స్ కోసం సముద్రంలోకి పడవ పై చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో పడవ పై మాట్లాడుతుండగా ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. దాంతో వెంటనే లోకల్ బాయ్ నాని సముద్రం లోకి దూకి సోహెల్ ను రక్ష్మించాడు. నాని రక్ష్మించడంతో సోహెల్ ఊపిరి పీల్చుకున్నాడు. ప్రాణాలతో సోహెల్ బయటపడ్డాడు కానీ కాలికి మాత్రం గాయాలు అయ్యాయి.