Home » మురారి సినిమాకు గాంధీ కుటుంబంకు ఉన్న సంబంధం మీకు తెలుసా..?

మురారి సినిమాకు గాంధీ కుటుంబంకు ఉన్న సంబంధం మీకు తెలుసా..?

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులో మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. అయితే మహేష్ నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అయిన చాలా సినిమాలు మాత్రం సూపర్ హిట్ సాధించాయి. యువరాజు, వంశీ వంటి డిజాస్టర్ తర్వాత మహేష్ చేసిన సినిమా మురారి. ఇందులో సూపర్ స్టార్ కు జంటగా… సోనాలి బింద్రే నటించింది. ఇందులో వారి మధ్య జరిగే ప్రతి సంఘటన కూడా అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Advertisement

అయితే మురారి సినిమా కథ అనేది అందరికి బాగానే గుర్తుండి ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా శాపం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు వంశంలో ప్రతి తరంలో ఎవరో ఒక్కరు చిన్న వయసులోనే చనిపోతారు. ఈ సినిమాకు గాంధీ కుటుంబంకు ఉన్న సంబంధం కూడా ఇదే. అసలు ఏం జరిగింది అంటే… ఈ సినిమా నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకి కృష్ణ తో మంచి సంబంధం ఉండేది. దాంతో అప్పుడు ప్లాప్స్ లో ఉన్న మహేష్ కు హిట్ సినిమా ఇవ్వాలని ఆయన కృష్ణవంశీకి చెప్పారు.

Advertisement

అయితే మహేష్ సినిమా కోసం కృషవంశీ ఆలోచిస్తూ… ఒక రోజు బోటు లో గోదావరి మీద ప్రయాణిస్తున్నప్పుడు.. ఆయనతో కలిసి ఆ బోర్డులో ప్రయాణిస్తున్న ఓ ఆయుర్వేద డాక్టర్ తో గాంధీ కుటుంబంలోని రాజీవ్ గాంధీ, ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ ఇలా ఒకే కుటుంబంలోని వారు అందరూ చిన్న వయసులోనే ఎందుకు చనిపోయారు అంటూ అడగగా.. దానిని శాపమే కారణం అని ఆ ఆయుర్వేద డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత దాని పై బాగా రీసర్చ్ చేస్తుంటే.. ఇటువంటి మరో కథ కృషవంశీకి దొరికింది. దాంతో ఆ రెండు కథలను కలిపి కృషవంశీ మురారి కథను సిద్ధం చేసాడు. ఆ తర్వాత 2001 వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :

తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!

టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!

Visitors Are Also Reading