Home » అలనాడు ఎన్టీఆర్, నిన్న మెగాస్టార్.. నేడు నెంబర్ వన్ హీరో ఎవరు..?

అలనాడు ఎన్టీఆర్, నిన్న మెగాస్టార్.. నేడు నెంబర్ వన్ హీరో ఎవరు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మన తెలుగు ఇండస్ట్రీ నుండి దేశ వ్యాప్తంగా పేరు సంపాదించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అలనాటి హీరో అన్నగారు ఎన్టీఆర్ మాత్రమే..ఇలా తెలుగు ఇండస్ట్రీని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి ఉంచారు ఆయన. ఆనాటి ఎన్టీఆర్ తర్వాత వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన కూడా ఇండస్ట్రీలో చాలా మంచి హీరోగా ఎదగడమే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీని పైస్థాయిలో ఉంచారు..

Advertisement

అయితే ఇండస్ట్రీ అంటే చాలా మందికి అవసరం కానీ, వీరిద్దరూ ఇండస్ట్రీకి అవసరం అనే విధంగా పేరును సంపాదించారు.. వీరిద్దరు గొప్ప నటులు మరియు మనసున్న మనుషులు అని కూడా చెప్పవచ్చు.. ఈ విధం గా చాలా మంది అభిమానులు ఇండస్ట్రీలో గత మూడు తరాలుగా హీరోలను అభివర్ణిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. మొదటి తరంలో ఎన్టీఆర్, రెండవ తరంలో చిరంజీవి.. నేటి తరం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నా ఎవరు అనేది డిసైడ్ చేయడం చాలా కష్టం.. వీటి కంటే ముందు మాత్రం వీరిద్దరూ తరానికి ఒక్కరూ అనే విధంగా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే రాముడు,కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయని పాత్ర అంటూ లేవు. ఈ విధంగా అన్ని పాత్రలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తర్వాత చిరంజీవి ఎన్టీఆర్ లెవల్లో బలంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్వయంకృషితో తన నటనతో డాన్స్ తో సొంతంగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా, మరికొద్ది రోజుల్లో వీళ్లలో ఎవరు ఈ తరానికి నిలిచిపోయే హీరో అవుతారు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.

ALSO READ;

Visitors Are Also Reading