Home » లైగ‌ర్ షూటింగ్ పూర్తి…రిలీజ్ డేట్ ఫిక్స్..!

లైగ‌ర్ షూటింగ్ పూర్తి…రిలీజ్ డేట్ ఫిక్స్..!

by AJAY
Ad

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం లైగ‌ర్. ఈ సినిమాలో అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. క్రేజీ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ‌డా నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మ‌రియు ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. నేడు సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్టు చిత్ర యూటిన్ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఈ సినిమాను ఆగ‌స్టు 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

Advertisement

Advertisement

ఇక షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో మైక్ టైస‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఎన్నో అంచనాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండ‌బోతుందా అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే లైగ‌ర్ చూడాలంటే ఆగ‌స్టు వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading