Home » ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ..!

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ..!

by Azhar
Ad
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో మొదట చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు అనేవి చేసాడు. కానీ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి సూపర్ హిట్ అనేది అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసిన అర్జున్ రెడ్డి మొత్తం సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం కూడా సూపర్ హిట్ కావడంతో మళ్ళీ విజయ్ దేవరకొండ వెన్నకి చూసుకోలేదు. ఈ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయిన కూడా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న లైగర్ విడుదల కాకముందే తన పేరిట రికార్డులు అనేవి క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తో పాటుగా రాధే శ్యామ్ రికార్డులను బ్రేక్ చేసింది. అయితే లైగర్ సినిమా యొక్క ట్రైలర్ అనేది నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొత్తం 24 గంటలో హిందీలో 31 మిలియన్ వ్యూస్ అనేది అందుకుంది.
దాంతో లైగర్ ఒక్కరోజులో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ సినిమా ట్రైలర్ లలో ఆర్ఆర్ఆర్ అలాగే రాధే శ్యామ్ ను వెన్నకి నెట్టి మూడో స్థానానికి వచ్చింది. అయితే ఈ లీగ్ లో సౌత్ సినిమాల నుండి మొదటి స్థానంలో కెజిఎఫ్ 2 యొక్క ట్రైలర్ ఉండగా… ఆ తర్వాత ప్రభాస్ హీరోగా బాహుబలి తర్వాత విడుదల అయిన సాహో సినిమా రెండో స్థానంలో ఉన్నాయి. అయితే ఈ లైగర్ సినిమాకు హిందీలో ఇంత క్రేజ్ అనేది రావడానికి కరణ్ జోహార్ కారణం అని అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. మారి ట్రైలర్ లా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading