Home » పనిమనుషులు, డ్రైవర్లు లిఫ్ట్ ఎక్కితే 300 జరిమానా…హైదరాబాద్ లో వివాదాస్పదంగా బోర్డు..!

పనిమనుషులు, డ్రైవర్లు లిఫ్ట్ ఎక్కితే 300 జరిమానా…హైదరాబాద్ లో వివాదాస్పదంగా బోర్డు..!

by AJAY
Ad

హైదరాబాద్ లో అపార్ట్మెంట్ నిర్వాహకులు తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ దగ్గర పెట్టిన బోర్డు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బోర్డులో ఏం పెట్టారో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డుపై ఇంట్లో పని చేసే వాళ్ళు, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, మెయిన్ లిఫ్ట్ ను ఉపయోగిస్తే రూ. 300 జరిమానా విధిస్తామని రాసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ బోర్డును హర్ష వడ్లమాని అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

Advertisement

దాంతో తన ట్వీట్ ను వందల మంది షేర్ చేస్తున్నారు. ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం తప్పు అని ఇలా బోర్డు పెట్టి వాళ్ళు చేసే వృత్తుల వారిని అవమానిస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా దీనిపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ పోలీస్ కు ట్యాగ్ చేశారు. ఇక మరో నెటిజన్ ఏకంగా కేటీఆర్ ఈ విషయంపై స్పందించాలని కేటీఆర్ ను టాగ్ చేశారు. ఇక హైదరాబాదులో అక్కడక్కడ ఫలానా కులం వారికే గదులు అద్దెకు ఇస్తామని బోర్డులు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

కానీ లిఫ్ట్ లో పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఎక్కకూడదు అని బోర్డు కనిపించడం ఇదే మొదటిసారి ఏమో. దాంతో దీనిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే కామెంట్ చేస్తున్న వారిలో కొందరు మాత్రం కూడా పాజిటివ్ గా కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది ఇలాంటి సమయంలో మెయిన్ లిఫ్ట్ వాడటం అపార్ట్ మెంట్ వాసులకు ప్రమాదమని కాబట్టి వాళ్లు సర్వీస్ లిఫ్ట్ ఉపయోగించు కుంటే మంచిదని కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading