Home » LIFE OF MUTTHU REVIW “ది లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా రివ్యూ…!శింబుకు హిట్ ప‌డిందా..?

LIFE OF MUTTHU REVIW “ది లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా రివ్యూ…!శింబుకు హిట్ ప‌డిందా..?

by AJAY
Ad

ప‌రిచ‌యం :

ఒక‌ప్పుడు త‌మిళ‌నాట స్టార్ హీరోగా రాణించిన శింబు ఆ త‌ర‌వాత డీలా ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఇటీవ‌లే శింబు ఓ సినిమాతో హిట్ అందుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చాడు. కాగా ఇప్పుడు లైఫ్ ఆఫ్ ముత్తు అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ త‌మిళ సినిమాను తెల‌గులో కూడా డబ్ చేశారు. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక‌ సినిమా టీజ‌ర్ మరియు ట్రైల‌ర్ లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఆ అంచ‌నాల‌ను రీచ్ అయ్యిందా లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం…

Advertisement

క‌థ & క‌థ‌నం :

ముత్తు చిన్న‌నాటి నుండి త‌న త‌ల్లితో ఊర్లో క‌ష్ట‌ప‌డి బ్ర‌తుకుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఇబ్బంల వ‌ల్ల త‌ల్లితో క‌లిసి ముంబాయి వెళ‌తాడు. అక్క‌డ ఓ హోట‌ల్ లో పని దొరుకుతుంది. హోట‌ల్ లో ప‌రోటాలు చేసే శింబు త‌న య‌జ‌మాని చెబితే హ‌త్య‌లు కూడా చేయాల్సివ‌స్తుంది. అక్క‌డ నుండి బ‌ట‌య‌ప‌డాలి అనుకుంటాడు కానీ అంత‌లోనే కొంద‌రు దుండ‌గులు పరోటా షాప్ పై దాడి చేస్తారు.ఆ స‌మ‌యంలో అంద‌ర్నీ ఎదిరించి త‌న డాన్ ను కాప‌డతాడు. అప్పుడు డాన్ కు ఫేవ‌రెట్ గా మార‌డంతో అత‌డిని ప‌ర్స‌న‌ల్ బాడీగార్డ్ గా నియ‌మించుకుంటాడు. ఆ త‌ర‌వాత ముత్తు ఎలా డాన్ గా ఎదిగాడు.

Advertisement

అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ‌తాడు. లైఫ్ లో మ‌రయు ప్రేమ‌లో గెలిచాడా అన్న‌దే ముత్తు సినిమా క‌థ‌. శింబు ఇప్పటి వ‌ర‌కూ చేసిన సినిమాల్లో ఇదొక డిఫ‌రెంట్ జోన‌ర్ అనే చెప్పాలి. సినిమాలో శింబు న‌ట‌న ప్రేక్ష‌కులకు న‌చ్చుతుంది. హీరోహీరోయిన్ ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. అంతే కాకుండా నాచుర‌ల్ గా ఉండే సీన్లు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. త‌ల్లి రాధిక శింబు ల సెంటిమెంట్ సీన్లు వ‌ర్కౌట్ అయ్యాయి. సినిమాకు ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ప్ల‌స్ అయ్యింది. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ కూడా ప్రేక్షకుల‌కు న‌చ్చుతుంది. డాన్ పాత్ర‌ల‌లో న‌టించిన నటులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. రెగ్యుల‌ర్ గ్యాంగ్ స్ట‌ర్ సినిమాల మదిరిగా భారీ ఎలివేష‌న్స్ లేకుండా సినిమా సింపుల్ గా ఉంది. ఈ సినిమాను ఒక‌సారి థియేట‌ర్ లో చూడ‌వచ్చు.

Visitors Are Also Reading