తెలంగాణలోని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాట మార్చినదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు పొలంలోనే వడ్లను కొంటాం అని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో హామీని ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేదన్నారు. సన్న వడ్లు వేయాలని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది..? ప్రతి గింజా కొంటామని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ ఆందోళన చేయడం హస్యాస్పదం అని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
పక్క రాష్ట్రాలో మద్దతు ధరకు మించి క్వింటాల్ కి రూ.500 చెల్లిస్తున్నారని, ఇతర వరి ధాన్యం కొనుగోలుకు సమస్య లేనప్పుడు తెలంగాణలో ఎందుకుందని ప్రశ్నించారు. మద్దతు ధర కాదు కదా కనీసం వరి ధాన్యాన్నే కొనం అని ప్రభుత్వం ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. రైతుల దగ్గర ధాన్యం కొనండి. ఆ తరువాత కేంద్రంతో మాట్లాడండి అని సూచించారు తూడి దేవేందర్ రెడ్డి. తక్షణమే మద్దతు ధర నిర్ణయించాలని, వరి పంట వేయాలని మీరే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. తక్షణమే మద్దతు ధర నిర్ణయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన వరి, రైతులను ఆదుకోకపోతే మిగతా పంటల సంగతి ఏమి అని ప్రశ్నించారు.