Telugu News » Blog » లెజెండ్ సినిమాలో న‌టించ‌డానికి జ‌గ‌ప‌తి బాబు మొద‌ట ఎందుకు నో చెప్పారు..తెర‌వెన‌క జ‌రిగిన స్టోరీ ఇదే..!

లెజెండ్ సినిమాలో న‌టించ‌డానికి జ‌గ‌ప‌తి బాబు మొద‌ట ఎందుకు నో చెప్పారు..తెర‌వెన‌క జ‌రిగిన స్టోరీ ఇదే..!

by AJAY
Ads

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ బోయ‌పాటి కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సింహ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా కంటే ముందు బాల‌య్య‌కు వ‌రుస‌గా ఆరుప్లాప్ లు ప‌డ్డాయి. అలాంటి సమ‌యంలో బోయ‌పాటి బాల‌య్య నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అదే చూపించి సూప‌ర్ హిట్ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో లెజెండ్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ కు పూకాలు తెప్పించింది.

Advertisement

ఈ సినిమా త‌ర‌వాత బాల‌య్య ఫుల్ బిజీ అయ్యారు. ఇక ఇదే సినిమాతో జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా ప‌రిచయం అయ్యాడు. అంతే కాకుండా విల‌న్ గా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. అయితే ఈ సినిమాకు తెర‌వెన‌క చాలా క‌థ జ‌రిగింది. ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం….ఈ సినిమాలో మొద‌ట హీరోయిన్ లుగా అంజ‌లి మ‌రియు జెన్నీఫ‌ర్ ఫెర్నాండేజ్ ను అనుకున్నారు. కానీ ఆ త‌ర‌వాత హీరోయిన్ గా రాధిక అప్టేను సెల‌క్ట్ చేశారు.

Advertisement

Advertisement

సోనాల్ చౌహాన్ ను కూడా తీసుకున్నారు. ఇక సినిమాలో విల‌న్ కోసం చాలా పేర్ల‌ను ప‌రిశీలించారు. త‌మిళ్ స్టార్ విల‌న్ పేరును సైతం ప‌రిశీలించారు. ఆ త‌ర‌వాత జ‌గ‌ప‌తి బాబు అయితే సూప‌ర్ గా ఉంటుంద‌ని అనుకున్నార‌ట‌. అయితే మొద‌ట జ‌గ‌ప‌తి బాబు విల‌న్ గా నో చెప్పార‌ట‌. కానీ ఆ త‌ర‌వాత విల‌న్ గా నటించేందుకు ఓకే చెప్పార‌ట‌. త‌న‌కు హీరోగా అవ‌కాశాలు త‌గ్గుముకం ప‌ట్టాయ‌ని అంతే కాకుండా బాల‌య్య హీరోగా న‌టిస్తున్నార‌ని జ‌గ‌ప‌తి బాబు ఓకే చెప్పారట‌.

Jagapati babu

Jagapati babu

మొద‌ట జ‌గ‌ప‌తి బాబుకు భార్య‌గా ర‌మ్య‌కృష్ణ‌ను అనుకున్నారు. కానీ ఆ త‌ర‌వాత క‌ల్యాణిని ఎంపిక చేశారు. ఈ సినిమాకు మొద‌ట జై సింహా అనే టైటిల్ ను అనుకున్నారు కానీ ఆ త‌ర‌వాత లెజెండ్ గా మార్చారు. ఇక 2014లో విడుద‌లైన ఈ సినిమా అద్భ‌త‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాల‌య్య వ‌న్ మ్యాన్ షోతో ఆడియ‌న్స్ కు మాస్ బిర్యానీ పెట్టారు.