ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జై భీమ్. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో అనగారిన వర్గాల కోసం పోరాడే వకీలుగా సూర్య నటించాడు. అంతే కాకుండా తమిళనాడులో 28 ఏళ్ల క్రితం జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాయే ను తెరకెక్కించారు. ఇక సూర్య చంద్రు అనే న్యాయవాది పాత్రలో నటించగా సినిమాలో పార్వతమ్మ అలియాస్ సినతల్లి అనే మరో ముఖ్యమైన పాత్రలో లిజ్ మోల్ జోష్ అనే అమ్మాయి నటించింది. సినిమా చూసిన తరవాత చంద్రు అనే లాయర్ ని చూడాలని ఎంత మంది అనుకున్నారో..రియల్ లైఫ్ సినతల్లిని చూడాలని కూడా అంతే మంది అనుకున్నారు.
దానికి కారణం న్యాయవాదిని మాత్రమే నమ్ముకుని తన భర్త చావుకు న్యాయం జరగాలని సినతల్లి చేసిన పోరాటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భర్త చావుకు వెల కట్టిన పోలీసులకు రియల్ లైఫ్ సినతల్లి చెప్పిన గుణపాఠానికి ఆమె ధైర్యానికి ప్రేక్షకులు జై భీమ్ అంటున్నారు. ఇక తన భర్త పోలీసుల చేతిలో చనిపోయిన తరవాత రియల్ లైఫ్ సినతల్లి తన కూతురుతో కలిసి ఉంటోంది. కాగా జైభీమ్ సినిమా చూసిన తరావాత చాలా మంది ప్రముఖులు ఆమెను కలుస్తున్నారట. కాగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ సినతల్లికి ఇల్లు కట్టిస్తా అంటూ ప్రకటించాడు.
Advertisement
Advertisement
సినిమా చూసిన అనంతరం లారెన్స్ దర్శకుడు జ్ఞానవేల్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా రాజా కన్ను భార్య సినతల్లికి ఇల్లు కట్టిస్తానని లారెన్స్ హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటం చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమెకు ఖచ్చితంగా మంచి ఇల్లు కట్టిస్తానని లారెన్స్ మాటిచ్చారు. ఇక లారెన్స్ తీసుకున్న నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతే కాకుండా సొంతంగా ఓ అనాథ శరాణాలయాన్ని లారెన్స్ నడిపిస్తున్నారు.