Home » మెగా ఫ్యామిలీ తో లావణ్య త్రిపాఠి.. ఇలా దొరికిపోయిన వరుణ్ తేజ్…!

మెగా ఫ్యామిలీ తో లావణ్య త్రిపాఠి.. ఇలా దొరికిపోయిన వరుణ్ తేజ్…!

by AJAY
Ad

సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఊహించలేము. ఎప్పుడు ఎవరి పెళ్లి వార్త వినాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ వార్త ఏమిటంటే తన పుట్టినరోజు సందర్భంగా లావణ్య త్రిపాఠికి 25 లక్షల విలువచేసే గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వడానికి వరుణ్ బెంగళూరుకు వెళ్లారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.

Advertisement

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్త వైరల్ అయింది. దాంతో అసలు వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠి కి మధ్య ఉన్న సంబంధం ఏంటని నెటిజన్ లు వెతకడం ప్రారంభించారు. ఇక వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని వార్తలు రావడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి మిస్టర్ కాగా మరో సినిమా అంతరిక్షం 9000 కేఎంపీహెచ్” ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ గా నిలిచాయి.

Advertisement

కానీ ఈ సినిమాల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఎంతో పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వరుణ్ తేజ్ సోదరి నిహారిక పెళ్లి లాక్ డౌన్ సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే నిహారిక పెళ్లి రాజస్థాన్ లో జరగ్గా అక్కడ మెగా ఫ్యామిలీ తో పాటు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమైన వాళ్ళు మాత్రమే కనిపించారు. కానీ ఈ పెళ్లికి లావణ్య త్రిపాటి రావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

అంతేకాకుండా ఓ ఫోటోలో కేవలం మెగా కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఆ ఫోటోలో లావణ్య త్రిపాఠి వారితో కలిసి దిగడం కూడా లావణ్య వరుణ్ లవ్ లో ఉన్నారని వార్తలు రావడానికి కారణమైంది. అంతేకాకుండా ప్రస్తుతం లావణ్య త్రిపాటి మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో నెట్టింట్ లో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది లావణ్య మెగా కోడలు అవుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading