Home » వ‌రుణ్ తేజ్ పై ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన‌ లావ‌ణ్య‌…ట్వీట్ వైర‌ల్…!

వ‌రుణ్ తేజ్ పై ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన‌ లావ‌ణ్య‌…ట్వీట్ వైర‌ల్…!

by AJAY
Ad

మెగాహీరో వ‌రుణ్ తేజ్ పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. వ‌రుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అశించిన‌మేర విజ‌యం సాధించ‌లేదు. కానీ ఆ త‌ర‌వాత కూడా వ‌రుణ్ తేజ్ వ‌రుస ఆఫ‌ర్లు అందుకున్నాడు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఎఫ్ 2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

ఇదిలా ఉండ‌గానే వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ని సినిమా తాజాగా నేడు విడుద‌లైంది. బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌చ్చి ఈ స్పోర్ట్స్ డ్రామాకు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో వ‌రుణ్ తేజ్ కు సాయి మంజ్రీక‌ర్ జోడీగా న‌టించింది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా విడుద‌ల సంధ‌ర్భంగా ఓ హీరోయిన్ వ‌రుణ్ తేజ్ కు ఆల్ ది బెస్ట్ చెప్ప‌గా దానికి సంబంధించిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు…లావ‌ణ్య త్రిపాఠి. వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉన్నార‌ని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ ఇన్డైరెక్ట్ గా అలాంటిది ఏమీ లేదు అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ వార్త‌లు రావ‌డానికి కార‌ణం రాజ‌స్థాన్ లో క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిన నిహారిక పెళ్లికి లావ‌ణ్య హాజ‌ర‌వ్వ‌డ‌మే.

ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీతో క‌లిసి లావ‌ణ్య కూడా ఫోటో దిగ‌డ‌మే హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా లావ‌ణ్య వ‌రుణ్ తేజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది. నువ్వు నీ పాత్ర‌కు 110 శాతం న్యాయం చేశావు అంటూ వ‌రుణ్ తేజ్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. నీ మ‌రియు మీ టీమ్ హార్డ్ వ‌ర్క్ స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొంది. ఇక ప్ర‌స్తుతం లావ‌ణ్య త్రిపాఠి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. వ‌రుణ్ తేజ్ అంటే లావ‌ణ్య‌కు ఎంత ప్రేమో అంటూ నెటిజ‌న్లు కామెంట్ లు పెడుతున్నారు.

Visitors Are Also Reading