Home » హైద‌రాబాద్‌ కింగ్ కోటి ప్ర‌భుత్వాసుప‌త్రిలో ప్ర‌స‌వ నొప్పుల‌ను త‌గ్గించేందుకు లాఫింగ్ గ్యాస్‌..!

హైద‌రాబాద్‌ కింగ్ కోటి ప్ర‌భుత్వాసుప‌త్రిలో ప్ర‌స‌వ నొప్పుల‌ను త‌గ్గించేందుకు లాఫింగ్ గ్యాస్‌..!

by Anji

ప్ర‌స‌వ స‌మ‌యంలో మ‌హిళ‌లు ప‌డుతున్న బాధ‌ల‌ను త‌గ్గించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో కింగ్ కోటి జిల్లా ఆసుప‌త్రిలో శిశువుల‌కు ప్ర‌స‌వించే స‌మ‌యంలో ఎంటానాక్స్ (నైట్ర‌స్ ఆక్సైడ్‌, ఆక్సిజ‌న్‌ల మిశ్ర‌మంతో కూడిన గ్యాస్‌)ను ఉప‌యోగించ‌డం ప్రారంభించారు. తీవ్ర నొప్పుల‌తో బాధ‌ప‌డు గ‌ర్భిణుల‌కు ఇప్పుడు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని జిల్లా ఆసుప‌త్రి కింగ్ కోటి గైన‌కాల‌జీ విభాగ అధిప‌తి డాక్ట‌ర్ జ‌ల‌జ వెరోనికా వెల్ల‌డించారు. హైద‌రాబాద్ ప్ర‌భుత్వ ఆసుప్ర‌తిల‌లో మోహ‌రించిన దాని విధ‌మైన ప‌రికాల్లో ఇది మొట్ట‌మొద‌టిది అని ఆమె తెలిపారు.

ఈ ప‌రిక‌రం సాయంతో ప్ర‌స‌వ స‌మ‌యంలో ఉన్న మ‌హిళ‌లు ఆక్సిజ‌న్ లాఫింగ్ గ్యాస్ మిశ్ర‌మాన్నిపీల్చ‌డం ద్వారా వారి నొప్పిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని కూడా చెప్పారు. ముఖ్యంగా ప్ర‌తి సంకోచంలో వాయువులో శ్వాస ఉంటుంది. వాయువులు 15 నుంచి 20 సెక‌న్ల‌లో ఇంద్రియ నాడుల‌పై ప‌ని చేయ‌డం ప్రారంభిస్తాయి. ఒక‌టి నుండి రెండు నిమిషాల వ‌ర‌కు నొప్పి ఉప‌శ‌మ‌నం అందిస్తాయి. మ‌త్తు మందుగా ప‌ని చేయ‌డానికి బ‌దులుగా అవి అనాల్జేసిక్ గా పని చేస్తాయ‌ని డాక్ట‌ర్ జ‌ల‌జ‌ చెప్పారు.

ప్ర‌స‌వ స‌మ‌యంలో స్త్రీలు నొప్పిని భ‌రించ‌లేన‌ప్పుడు మేము వారికి ఎంటానాక్స్ సిలిండ‌ర్‌కు క‌నెక్ట్ చేయ‌బ‌డిన ఆక్సిజ‌న్ మాస్క్ అందిస్తాం. ఊపిరి బాగా పీల్చిన‌ప్పుడు గ్యాస్ ఆమె శ‌రీరంలో లోకి వెళ్లి నొప్పిని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. మే 12 మొట్ట‌మొద‌టి సారిగా ఉప‌యోగించామ‌ని.. అప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 13 మంది గర్భీణీ స్త్రీలు ఆసుప‌త్రిలో ప్ర‌స‌వ స‌మ‌యంలో ఈ ఫార్ములా ఉప‌యోగించార‌ని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దీనిని అమ‌లు చేయ‌డానికి తెలంగాణ ఆరోగ్య‌శాఖ యోచిస్తోంద‌ని ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ తెలిపారు.

Also Read : 

హైదరాబాద్: హలీం తర్వాత, లాక్ బ్యాంగిల్స్.. “GI” ట్యాగ్ సాధించాయి..?

Visitors Are Also Reading