ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ 92 ఈరోజు తుది శ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉదయం 8 గంటల 15 నిమిషాలకు లతమంగేష్కర్ తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో 29 రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 8వ తేదీన లతా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆమె కరోనా నుండి కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు.
Also Read: రామానుజాచార్యుల సమతాసూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి
Advertisement
Advertisement
కరోనా తర్వాత లంగ్స్ లో వచ్చిన ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నట్టు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని కొద్దిరోజుల క్రితం డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉండగానే నిన్న లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని మరోసారి డాక్టర్లు ప్రకటించారు. వైద్యుల సమక్షంలోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
ఇక తాజాగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూసినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనిపై కుటుంబ సభ్యులు గానీ వైద్యులు కానీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా లతామంగేష్కర్ తెలుగు తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. నైటింగెల్ ఆఫ్ ఇండియాగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: ఆ రాశివారికి ఉద్యోగబలం పెరుగుతుంది