క్రెడిట్ కార్డు కంపెనీలు ఇటీవలే లేట్ పేమెంట్పేమెంట్ ఫీజులను భారీగానే పెంచాయి. ఈ లిస్ట్‌లో తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు కూడా చేరింది. ఫిబ్రవరి 10 నుంచి తమ కొత్త ఫీజు అమలులోకి వస్తున్నదని ప్రకటించింది.. క్రెడిట్ కార్డు పేమెంట్ చేయడంలో ఫెయిల్ అయితే చెల్లించాల్సిన మొత్తం మీద వడ్డీతో పాటు జరిమానా కూడా పడుతుంది. దీని ప్రభావం క్రెడిట్ కార్డు స్కోర్ మీద పడుతుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా లేట్ పేమెంట్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏ బ్యాంకు ఎంత వవసూలు చేస్తుందో తెలుసుకుందాం.
Advertisement
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు..
ఐసీఐసీఐ బ్యాంకు ఎమెరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా మిగిలిన అన్నీ కార్డులకు సంబంధించి లేటు ఫీజు ఛార్జీలను సవరించింది. డ్యూ అమౌంట్ రూ.100 కంటే తక్కువ ఉంటే ఎటువంటి లేటు ఫీజు ఉండదు. డ్యూ అమౌంట్ రూ.100 500 మధ్య ఉంటే రూ.100 ను రూ.501 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. రూ.10వేలు వరకు ఉంటే.. రూ.750ని రూ.25,000 వరకు ఉంటే రూ.900ను వసూలు చేస్తుంది. రూ.50వేల వరకు ఉంటే.. రూ.1,000, రూ.5లక్షలుంటే రూ.1200 లేటు ఫీజుగా జరిమానా విధిస్తుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు..
అదేవిధంగా లేట్ పేమెంట్ ఛార్జీలను చెల్లించకపోతే ఎస్‌బీఐ కార్డు వెబ్‌సైట్ పేర్కొంటుంది. చెల్లించాల్సిన అమౌంట్ రూ.500 ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.50వేలకు మించితే రూ.1300 లేట్ పేమెంట్ ఫీజు వడ్డిస్తోంది. అంతేకాదు.. మినిమం అమౌంట్ చెల్లించడంలో రెండు సైకిల్స్ విఫలం చెందితే.. అదనంగా మరొక రూ.100 లేట్ పేమెంట్ ఛార్జీగా విధిస్తుంది. మినిమం అమౌంట్ చెల్లించే వరకు ప్రతీ పేమెంట్ సైకిల్ లో ఈఛార్జీని ఎస్ఐబీ కార్డు వసూలు చేయనున్నది.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు..
Advertisement
క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఉన్న మొత్తాన్ని గడువు తేదీలోగా చెల్లించాలి. ప్రాసెసింగ్ సమయమును దృష్టిలో పెట్టుకుని మరొక మూడు రోజుల గ్రీస్ పీరియడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇస్తోంది. ఈ బ్యాంకు లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.100 నుంచి 1300 వరకుంటున్నాయి. చెల్లించాల్సిన అమౌంట్ రూ.100 మించితే.. రూ.1300 లేట్ పేమెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు కూడా కస్టమర్లపై క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ ఛార్జీలను వడ్డిస్తోంది. ఈ ఛార్జీలను రూ.100 నుండి రూ.1300 మధ్యలో ఉంటాయి అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. లేట్ పేమెంట్ ఛార్జీలు కూడా ఒక్కో కార్డుకు ఒక్కో విధంగా ఉంటాయని వెల్లడించింది.
యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు..
సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులను వాడే వారిపై ఆ బ్యాంకు రూ.100 నుండి రూ.1300 వరకు లేట్ పేమెంట్ ఫీజు విధిస్తోంది. స్టేట్‌మెంట్ బాలెన్స్ రూ.2000 లోపు ఉంటే.. ఎలాంటి ఛార్జీలు ఈ బ్యాంకు వేయడం లేదు. రూ.15వేలకు మించితే మాత్రం రూ.1300 లేట్ పేమెంట్ ఛార్జీలను విధిస్తోంది.
సిటీ ప్రెస్టీజ్ కార్డు..
స్టేట్‌మెంట్ బాలెన్స్ రూ.2వేల వరకు ఎలాంటి అమౌంట్ ఫీజు లేదు. రూ.వేలకుఉ మించితే రూ.100 లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాలి.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు..
చెల్లించాల్సిన అమౌంట్‌పై కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1,000 లేట్ పేమెంట్ ఫీజును ఈ కంపెనీ వసూలు చేస్తోంది.
అదేవిధంగా చెల్లించాల్సిన సమయంలోపు చెల్లించాలని క్రెడిట్ కార్డుల కంపెనీలు మెసేజ్, ఈమెయిల్స్ పంపుతాయి. ఒకవేళ చెల్లించడంలో విఫలం చెందితే.. జరిమానాతో పాటు వడ్డీ కూడా వసూలు చేస్తాయి. అప్పటివరకు జాలీగా గడిపినా.. ఇంట్రెస్ట్ ప్రీ ఫైనాన్సింగ్ కూడా నెల మనకు దూరమవుతుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ కార్డు వినియోగదారులారా ఈ విషయాలను గమనంలో పెట్టుకొని క్రెడిట్ కార్డును ఉపయోగించండి.