Telugu News » Blog » ల‌లితా జ్యువ‌ల‌రీ కిర‌ణ్ ఎందుకు గుండు చేసుకుంటాడో తెలుసా..? ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ల‌లితా జ్యువ‌ల‌రీ కిర‌ణ్ ఎందుకు గుండు చేసుకుంటాడో తెలుసా..? ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

by AJAY
Ads

ఎవ‌రైనా ఒత్తైన జుట్టుతో క‌నిపించాల‌ని కోరుకుంటారు. పురుషుల‌కు జుట్టే అందం అని చెబుతుంటారు. వెంట్రుకలు రాలిపోతే అది పెద్ద స‌మ‌స్య‌గా చూస్తారు. ఫంక్ష‌న్ ల‌కు వెల్ల‌డానికి బ‌య‌ట తిర‌గ‌టానికి కూడా సిగ్గు ప‌డుతుంటారు. అయితే ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మాత్రం ఒత్తైన జుట్టు ఉన్నా కూడా ఎప్పుడూ గుండుతోనే క‌నిపిస్తారు. ఆయ‌న గుండు వ‌ల్లనే వ్యాపారాన్ని కూడా పెంచుకున్నారు.

Advertisement

ఆయ‌న మ‌రెవ‌రో కాదు..డ‌బ్బులు ఊరికేరావు అంటూ చెప్పే గుండు బాస్ ల‌లితా జ్యువ‌ల‌రీ అధినేత కిర‌ణ్ కుమార్. జ్యువ‌ల‌రీ రంగంలో కిర‌ణ్ కుమార్ ప్ర‌స్తుతం టాప్ లో ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా ల‌లితా జ్యువ‌ల‌రీ బ్రాంచ్ ల‌ను స్థాపించారు. ఇక వ్యాపారంలో ఎన్ని పెట్టుబ‌డులు పెట్టినా స‌రైన ప్ర‌చారం లేకుంటే వృథానే కాబ‌ట్టి ప్ర‌ముఖ వ్యాపార సంస్థ‌లు కోట్ల‌ల్లో ఖ‌ర్చు చేసి సెల‌బ్రెటీల‌తో ప్ర‌చారం చేయిస్తుంటాయి.

Advertisement

ప్ర‌చారం కోసం ఖ‌చ్చితంగా బ్రాండ్ అంబాసిడ‌ర్ ల‌ను నియ‌మించుకుంటాయి. కానీ కిర‌ణ్ కుమార్ మాత్రం తానే సెల‌బ్రెటీగా మారిపోయాడు. గుండు లుక్ తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయి డ‌బ్బులు ఊరికేరావు అంటూ ఫేమ‌స్ అయ్యాడు. అయితే కిర‌ణ్ కుమార్ ది బ‌ట్ట‌త‌లనా…అన్ని కోట్ల అధిప‌తి అస‌లు గుండు ఎందుకు చేసుకుంటాడు అని ర‌క‌ర‌కాల ప్ర‌శ్నలు ఉన్నాయి. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో కిర‌ణ్ కుమార్ వాటికి స‌మాధానం ఇచ్చాడు.

Advertisement

గుండుతో ఉంటే ప్ర‌శాంతంగా ఉంటుందని చెప్పాడు. త‌న గుండును తానే గీసుకుంటాన‌ని అన్నాడు. అంతే కాకుండా గుండు గీసుకుంటే జుట్టురాలిపోతుంది తెల్ల‌జుట్టు వ‌స్తుంది అన్న టెన్ష‌న్ కూడా ఉండ‌ద‌ని చెప్పాడు. జుట్టు కోసం షాంపూలు వాడాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు కాబ‌ట్టి ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంద‌ని అన్నాడు. అందుకోస‌మే తాను గుండు చేసుకుంటాన‌ని తెలిపాడు.