Telugu News » ఎన్టీఆర్ ఆత్మ‌తో మాట్లాడాను.. లక్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఎన్టీఆర్ ఆత్మ‌తో మాట్లాడాను.. లక్ష్మీపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by Anji

ఎన్టీఆర్ 26వ వ‌ర్థంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఉన్న‌టువంటి ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఆయ‌న స‌మాధికి నంద‌మూరి కుటుంబ స‌భ్యులు నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మిపార్వ‌తి కూడా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీపార్వ‌తి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మృతి చెందిన‌ప్పుడు ఆయ‌న ఆత్మ‌తో మాట్లాడాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 26 సంవ‌త్స‌రాల త‌రువాత ఓ ర‌హ‌స్యం చెబుతున్నాను. ఎన్టీఆర్ మ‌ర‌ణించిన‌ప్పుడు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ త‌న‌ను మ‌ద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించార‌ని వెల్ల‌డించారు.

Ads

ఎన్టీఆర్ 16 ఏళ్ల అమ్మాయిలో ప్ర‌వేశించి త‌న‌తో అనేక విష‌యాలు పంచుకున్న‌ద‌ని.. ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. తెలుగు రాష్ట్రాల‌లో తాను మ‌ళ్లీ జ‌న్మిస్తాను అని, అంద‌రి ముఖ్య‌మంత్రుల మ‌న‌స్సులో తాను ఉంటాను అని.. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని తాను ప్ర‌బోధం చేస్తుంటాన‌ని ఆత్మ త‌న‌తో చెప్పింద‌ని పేర్కొన్నారు. ఆ అమ్మాయితో మాట్లాడిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు ఓ న‌మ్మ‌కం.. ఎన్టీఆర్ ఎప్పుడు తెలుగు ప్ర‌జ‌ల‌ను విడిచి పెట్టి ఉండ‌రు అని అభిప్రాయ ప‌డ్డారు ల‌క్ష్మీపార్వ‌తి.

ఎన్టీఆర్ ఆత్మ ఇక్క‌డే ఉన్న‌దని.. ఈ ఘాట్ ద‌గ్గ‌ర‌నే కాదు.. కానీ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రి వ‌ద్ద ఆయ‌న ఆత్మ తిరుగుతూ.. బాగోగులు చూసుకుంటుంద‌ని వెల్ల‌డించారు. జాతికి ఇలాంటి వారొక్క‌రే పుడుతార‌ని పేర్కొన్నారు. తెలుగు వారి గౌర‌వాన్ని చాటిన మ‌హానీయుడు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశార‌ని పేర్కొన్నారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎన్టీఆర్ త‌న‌కు తోడుగా ఉంటారు అని.. అడుగ‌డుగునా త‌న‌ను ర‌క్షించుకుంటూనే ఉన్నార‌ని, ఆయ‌న జ్ఞాప‌కాల్లోనే తాను ఇంకా బ‌తుకుతున్నాని పేర్కొన్నారు.

ఏపీలో ఎన్టీఆర్ విగ్ర‌హం ధ్వంసం ఘ‌ట‌న‌ల‌పై కూడా ల‌క్ష్మీపార్వ‌తి స్పందించారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసిన వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డంలో సీఎం జ‌గ‌న్ చాలా హుందాగా వ్య‌వ‌హ‌రించారు అని ప్ర‌శంసించారు. దుర్గిలో విగ్ర‌హం ధ్వంసం చేయ‌డం.. మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డితో మాట్లాడి వాస్త‌వాల‌ను తెలుసుకున్నాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌తిప‌క్షాలు హుందా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు ల‌క్ష్మీపార్వ‌తి.


You may also like