Home » మహిళలు ఈ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి.. ఆకతాయిల తాట తీయండి..!

మహిళలు ఈ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి.. ఆకతాయిల తాట తీయండి..!

by Anji
Ad

సాధారణంగా సాంకేతిక టెక్నాలజీ రంగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం 5జీ రగంలోకి అడుగు పెట్టాం. అయినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై ఏదో ఒక ఘటన చోట చేసుకుంటూనే ఉంది. అంతా జరిగిపోయిన తరువాత దానికి కారణం అయిన వారిని అరెస్ట్ చేస్తుంటారు పోలీసులు. ప్రస్తుతం మానవ మృగాల నుంచి అమ్మాయిలను రక్షించే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ ఎవరైనా సోషల్ మీడియాలో చాటింగ్ కి ఇచ్చిన ప్రాధాన్యత సొంత రక్షణ కోసం ఆయుధం మాదిరిగా మార్చుకోలేకపోతున్నారు. 

 

Advertisement

ముఖ్యంగా మహిళలు చాటింగ్ పై పెట్టే దృష్టి  మహిళలకు రక్షణగా ఉన్నటువంటి షీ టీమ్స్, డయల్ 100, డివిజనల్ షీ ఫై వంటి వాటిపై దృష్టి సారిస్తే పోకిరీల ఆగడాల నుంచి బయటపడవచ్చు. సాధారణంగా మనం వాట్సాప్ ని చాటింగ్, కాల్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ వాట్సాప్ మహిళల రక్షణకు ఓ ఆయుధంగా పని చేస్తుంది. ప్రస్తుతం రోజుల్లో మహిళల రక్షణకు ఓ ఆయుధంగా పని చేస్తుంది. మహిళలు వేదింపులకు గురైనప్పుడు 9490617444కి సందేశంపంపించడం ద్వారా వారిని వేధింపుల నుంచి బయటికి తీసుకొస్తాయి. అలాగే షీ టీమ్స్, డయల్ 100, డివిజినల్ షీ మహిళలకు తోడుగా నిలబడుతాయి. చాలా మంది మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు. ఈ తరుణంలో వీరి కోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వాట్సాప్ ద్వారానే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకి సైబరాబాద్ షీ టీమ్ కి 100 ఫిర్యాదులు వస్తే.. అందులో 75 ఫిర్యాదులు వాట్సాప్ ద్వారానే రావడం గమనార్హం.

Advertisement

Manam News

ఈ ఫిర్యాదులపై అధికారులు స్పందించి ఆ బాధితులను బయటికి తీసుకొస్తున్నారు. ఎవ్వరికీ తెలియకుండా సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి.  సోషల్ మీడియాలో ఫిర్యాదులు పెరగడంతో మహిళల్లో అవగాహన పెరిగిపోయింది. దీంతో పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు 9490617444 వాట్సాప్ ద్వారా సందేశం పంపించవచ్చు. లేదంటే 100కి డయల్ చేయవచ్చు.  cyberabad@gmail.com  మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. సైబరాబాద్ పరిధిలో అయితే Twitter (@sheteamcybd), Facebook ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఇప్పటికైనా మహిళలు అప్రమత్తంగా ఉండి సోషల్ మీడియాను మీ రక్షణకు వినియోగించుకోండి. 

Also Read :   చలికాలంలో బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు..!

Visitors Are Also Reading