Home » ముంబై జట్టుకి షాక్.. ఆ పేసర్ సీజన్ కి దూరం..!

ముంబై జట్టుకి షాక్.. ఆ పేసర్ సీజన్ కి దూరం..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో అత్యంత చెత్త జట్టు ఏది అని ఎవరిని అడిగిన అందరూ ముంబై ఇండియన్స్ పేరే చెబుతారు. ఎందుకంటే.. ఐపీఎల్ 2022 ముందు వరకు ఎంతో ఘన చరిత్రను కలిగి ఉన్న ఆ జట్టు ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో విఫలమవుతున్న ముంబై జట్టు ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది.

Advertisement

అయితే ఇప్పుడు వరుస వైఫల్యాలతో ఉన్న జట్టుకి మరో షాక్ తగిలింది. ఆ జట్టు యువ లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్ ముందు జరిగిన మెగా వేలంలో రూ. 20 లక్షలకు ముంబై ఇండియన్స్ అర్షద్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. కానీ జట్టులో ఉన్న సీనియర్ల కారణంగా అతనికి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే ఆవకాశం దొరకలేదు.

Advertisement

నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన అర్షద్ ఖాన్ స్థానంలో మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయను జట్టులోకి తీసుకుంది ముంబై జట్టు. అయితే కార్తికేయను కూడా అర్షద్ ఖాన్ ధర అయిన రూ. 20 లక్షలకే ముంబై జట్టులోకి తీసుకుంది. ఇక ముంబై జట్టు ఈ నెల 30న రాజస్థాన్ తో మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ లోనైనా ముంబై తన మొదటి విజయాన్ని అందుకుంటుందా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

అతి తక్కువ స్లెడ్జింగ్ జరిగే స్పోర్ట్స్ ఏంటో మీకు తెలుసా…?

కోహ్లీకి రెస్ట్ ఇవ్వం : బీసీసీఐ

Visitors Are Also Reading