Home » ఆయన మనసున్న వ్యక్తి….పవన్ కళ్యాణ్ పై కెటిఆర్ ప్రశంసల జల్లు…!

ఆయన మనసున్న వ్యక్తి….పవన్ కళ్యాణ్ పై కెటిఆర్ ప్రశంసల జల్లు…!

by AJAY
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ రానా కీలక పాత్రల్లో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యా మీనన్…రానాకు భార్యగా సంయుక్త మీనన్ లు నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ విడుదల చేశారు.

Advertisement

ఇక సినిమా ను ఈ నెల 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అంతే కాకుండా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా కెటిఆర్ ముఖ అతిథిగా వచ్చారు. తాను రాజకీయనాయకుడు గా ఈవెంట్ కు రాలేదని అన్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఓ మంచి మనసున్న వ్యక్తి అన్నారు. విలక్షణ మైన స్థాయి పవన్ కళ్యాణ్ సొంతమని అన్నారు.

Advertisement

తాను కాలేజీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా చూశానని కేషట పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణా అభివృద్ధి గురించి ఈవెంట్ లో మాట్లాడుతూ…ప్రపంచం లోనే కాళేశ్వరం అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అన్నారు. గోదావరి కి కొత్త దారి చూపించమని చెప్పారు. ఏపీలోని గోదావరి జిల్లాల తో పాటు తెలంగాణ లోని మల్లన్నసాగర్ర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాంతాల్లో కూడా షూటింగ్ లు జరపాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading