Telugu News » Blog » 45 ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేసిన కేటీఆర్

45 ఏళ్ల క్రితం ఫోటోను షేర్ చేసిన కేటీఆర్

by Anji
Ads

తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటీ శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు అల‌నాటి మ‌ధుర స్మృతుల‌ను ఈ మ‌ధ్య త‌ర‌చూ ప్ర‌జ‌ల‌తో ఏదో ఒక సంద‌ర్భంలో పంచుకుంటున్నారు. ఇటీవ‌ల ఇర‌వై ఏండ్ల క్రితం లండ‌న్‌లో గ‌డిపిన క్ష‌ణాల‌ను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా 2001లో లండ‌న్‌లో త‌న స్నేహితునితో ఉన్న ఫొటోల‌ను కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా డిసెంబ‌ర్ 11, 2021న పోస్ట్ చేశారు. ఈ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేశారు. ఒక‌రు బాగుంద‌ని.. మ‌రొక‌రు హీరోలా ఉన్నార‌ని ఇలా డ్రెస్సింగ్ స్టైల్ సూప‌ర్ అంటూ ఎవ‌రికీ న‌చ్చిన‌ట్టు వారు కామెంట్స్ పోస్ట్ చేశారు.

తాజాగా నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐటీ మంత్రి కేటీఆర్ ఓ అరుదైన ఫొటోను నెటిజ‌న్ల‌తో షేర్ చేసుకున్నారు. త‌న చిన్న‌నాటి ఫొటోను ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు మంత్రి. దాదాపు 45 ఏళ్ల క్రితం అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. మామూలుగా వైర‌ల‌వ్వ‌డం లేదు. సో క్యూట్ అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. నెల‌కొక ఫొటోను విడుద‌ల చేస్తున్నారు కేటీఆర్‌. గ‌త డిసెంబ‌ర్‌లో ఒక ఫొటోను విడుద‌ల చేయ‌గా.. తాజాగా ఫొటోను ట్విట్ చేశాడు.


You may also like